E-Paper
Advertisement

గవర్నర్ విజయ్ కు అవకాశం ఇవ్వకపోవడానికి అదే కారణమా..కస్తూరి శంకర్ కామెంట్స్ వైరల్!

గవర్నర్ విజయ్ కు అవకాశం ఇవ్వకపోవడానికి అదే కారణమా..కస్తూరి శంకర్ కామెంట్స్ వైరల్!
Advertisement

Kasturi Shankar: కస్తూరి శంకర్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఈమె రాజకీయ నాయకురాలిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బిజెపి నాయకురాలిగా కొనసాగుతున్న ఈమె ఒకవైపు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా కస్తూరి శంకర్ సోషల్ మీడియా వేదికగా పలు అంశాల గురించి స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈమె పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే తాజాగా తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలు గురించి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

విజయ్ పట్టాభిషేకానికి లైన్ క్లియర్..

తమిళనాడులో నటుడు విజయ్(Vijay) టీవీకే పార్టీ (TVK Party)పేరుతో ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈయన మొదటిసారి ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ నూట ఎనిమిది స్థానాలలో విజయం సొంతం చేసుకున్నారు. ఇక తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే 118 స్థానాలలో విజయం సాధించాల్సి ఉన్న నేపథ్యంలో విజయ్ అధికార పీఠంపై తమిళనాడు రాజకీయం వేడెక్కింది. ఎట్టకేలకు పలువురు విజయ్ కు మద్దతు తెలుపడంతో ఈయన పట్టాభిషేకానికి లైన్ క్లియర్ అయింది.

అతిపెద్ద సింగిల్ పార్టీ..

Advertisement

విజయ్ ఎన్నికలలో 108 స్థానాలలో విజయం సాధించినప్పటికీ తమిళనాడు గవర్నర్ మాత్రం ఈయనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి తెలుపలేదు ఈ అంశం గురించి కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. హీరో విజయ్ తన పార్టీని తమిళనాడులో అతిపెద్ద సింగల్ పార్టీగా గవర్నర్ ముందు ప్రదర్శించలేకపోయారు. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మద్దతుగా గవర్నర్ వద్దకు వెళ్లడంతోనే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అనుమతి వెల్లడించలేదని ఈమె తెలియజేశారు.ఒక పార్టీ కూటమిగా వెళ్ళినప్పుడు, గవర్నర్ ముందు ఖచ్చితమైన మెజారిటీ సంఖ్యను చూపించాల్సి ఉంటుంది. కేవలం అతిపెద్ద పార్టీగా వెళ్తే పరిస్థితి వేరుగా ఉండేదని, ఇప్పుడు రాజ్యాంగపరమైన నిబంధనల ప్రకారం గవర్నర్ తన నిర్ణయాన్ని వెలువరించారని ఆమె విశ్లేషించారు.

వారికి మంత్రి పదవులు కన్ఫామ్..

Advertisement

ఇలా గవర్నర్ ఆమోదం తెలపకపోవడం గురించి కస్తూరి శంకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నేటి సాయంత్రం వరకు విజయ్ విషయంలో అభిమానులు ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూశారు కానీ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా విజయ్ కు మద్దతు తెలపడంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆటంకాలు తొలగిపోయాయి. ఇక ఈయన త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈయనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీతో పాటు, సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Also Read: చీటింగ్ కేసు వ్యవహారం… నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చిన అషు రెడ్డి..ఫోటోలు వైరల్!

Related News

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×