S.Thaman : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న తమన్ (Thaman).. ఎప్పటికప్పుడు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. తన అద్భుతమైన బీజీఎంతో అందరిని అబ్బురపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలకృష్ణ (Balakrishna) సినిమాలకు ఆయన ఇచ్చే ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలయ్య సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే అందుకు ప్రధాన కారణం తమన్ అందిస్తున్న బీజీఎం అని కూడా చెప్పవచ్చు. బాలయ్య యాక్షన్ పర్ఫామెన్స్ కి తమన్ ఇచ్చే ఎలివేషన్ థియేటర్లలో ఒక రేంజ్ లో అదరగొట్టేస్తోంది. ఇప్పటికే బాలయ్య ఐదు సినిమాలకు వరుసగా పని చేసిన తమన్.. తాజాగా అఖండ 2 కోసం కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
అయితే అఖండ 2 కాదు అఖండ 5 అంటూ తమన్ తాజాగా చేసిన కామెంట్లపై అందరిలో సరికొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అఖండ 5 కూడా ఉంటుందా అంటూ అప్పుడే గుసగుసలాడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 4వ చిత్రం అఖండ 2. అఖండ సినిమాతో ఊహించిన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కాంబో.. ఇప్పుడు అంతకుమించి సక్సెస్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అఖండ 2 నుంచి “అఖండ తాండవం” పాటను ముంబైలో జరిగిన సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సందడి చేసిన చిత్ర బృందం అందులో భాగంగానే తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈవెంట్ సందర్భంగా తమన్ మాట్లాడుతూ..” బాలయ్య ఎంత నిజాయితీగా ఉంటారో.. అంతే హుందాగా ఉంటారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. నటుడిగా అలరిస్తూనే మరొకవైపు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఆయన కలలన్నీ నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆయనపై ఉండే ప్రేమను ఆయన సినిమాలకు సంగీతం అందిస్తూ తెలిపే అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
ALSO READ:Andrea Jeremiah: టాలెంట్ ఉన్న వారిని బ్రతకనివ్వరు.. కోలీవుడ్ పై హీరోయిన్ కామెంట్!
ఆయన నన్ను ఎప్పుడు కలిసినా ఈ సినిమాలో కొత్తగా ఏం చేస్తున్నావ్.. ఏం చూపించబోతున్నావని అడుగుతారు. మరోవైపు అందరూ ఒక భాగంలోనే సినిమా అంతా చూపించేశారు కదా.. ఇక రెండో భాగంలో ఏమంటుంది? అని కూడా అన్నారు. కానీ అఖండ చిత్రాన్ని 5 భాగాలుగా తీయవచ్చు. దానికి కూడా బాలయ్య సిద్ధంగానే ఉంటారు. ముఖ్యంగా శివుడి గురించి ఎంతైనా చెప్పొచ్చు.. ఇక ఈ వయసులో కూడా ఆయన డెడికేషన్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మరి తమన్ చెప్పినట్లు బాలయ్య అఖండ 5 చేయడానికి కూడా సిద్ధమేనా? అంత కథ బోయపాటి దగ్గర ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అఖండ 2 సినిమా విషయానికొస్తే.. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తూ ఉండగా.. జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది.