E-Paper
Advertisement

Ghee vs Butter: నెయ్యి లేదా వెన్న.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

Ghee vs Butter:  నెయ్యి లేదా వెన్న.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
Advertisement

తినే వంటల్లో బటర్, నెయ్యి.. రెండూ వాడే వారు ఎంతోమంది. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి సందేహమే. ఇదే విషయంపై అధ్యయనాలు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పింది. అధ్యయనాల ప్రకారం బటర్, నెయ్యి… రెండూ ప్రయోజనాలు కలిగి ఉన్నా, వాటిని ఎలా, ఎంత వాడాలన్నది ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. క్యాలరీల విషయంలో రెండింటికీ తేడా ఉంది. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో దాదాపు 120 క్యాలరీలు ఉంటాయి. అదే పరిమాణం బటర్‌లో 102 క్యాలరీలు ఉంటాయి. అంటే నెయ్యిలో కొంచెం ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. నెయ్యిలో పూర్తిగా ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. అందులో నీరు, పాలకణాలు లాంటివి ఉండవు.

ఏ విటమిన్లు ఉంటాయి?
బటర్, నెయ్యి.. రెండింటిలోనూ విటమిన్ A, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు వంటి శరీరానికి ఉపయోగకరమైన పోషకాలు ఉంటాయి. ఇవి కళ్లకు, చర్మానికి, రోగనిరోధక శక్తికి ఉపయోగపడతాయి. నెయ్యిలో ప్రత్యేకంగా కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు ఉంటుంది. పరిశోధనల ప్రకారం ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని శరీరంలో కొవ్వును నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిని తయారు చేసే సమయంలో పాలలోని లాక్టోజ్, కేసిన్ వంటి పదార్థాలు చాలా వరకు తొలగిపోతాయి. అందుకే పాలు జీర్ణం కానివారు అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉన్నవారు నెయ్యిని తింటే మంచిది. వీరు నెయ్యిని సులువుగా అరిగించుకుంటారు.

Advertisement

ఇక బటర్‌లో పాల ప్రోటీన్ కొంత మోతాదులో ఉంటుంది. బటర్‌కు స్వీట్, క్రీమీ రుచి ఉంటుంది. అందుకే దీన్ని కేకులు, బిస్కెట్లు, స్వీట్లు, బేకింగ్ చేసే వంటల్లో వాడతారు.
నెయ్యిని అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే గుణం కలిగి ఉంటుంది. దీన్ని వేపుడు వంటలు, తాళింపులలో వాడతారు. దీనికి నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది.

నెయ్యిలో ఉండే కొన్ని ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి మంచి చేస్తాయి. వాటిలో ఉన్న బ్యూటిరేట్ అనే పదార్థం కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతారు. ఇది జీర్ణం సరిగ్గా జరగడంలో సహాయపడుతుంది.ఈ రెండింటిలోనూ సాచురేటెడ్ ఫ్యాట్ అనే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, బరువు పెరగడం వంటివి రావచ్చు.

Advertisement

పాలు జీర్ణం కాని వారికి నెయ్యి మంచిది. బేకింగ్ ఎక్కువ చేసే వారికి బటర్ ఉపయోగకరం. అధిక ఉష్ణోగ్రతలో వంట చేసే వారికి నెయ్యి ఉత్తమం. ఈ రెండింట్లో విటమిన్లు ఉంటాయి. వెన్న, నెయ్యి రెండింటినీ వంటల్లో తరతరాలుగా వాడుతున్న పదార్థాలే. రెండింట్లోను ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కానీ ఏది మంచిదని చెప్పడం కష్టం. మీ శరీర పరిస్థితి, మీ డైట్, వంట పద్ధతి ఆధారంగా మీరు ఏది తినాలో ఎంపిక చేసుకోవాలి.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×