E-Paper
Advertisement

Fauji: ప్రభాస్ ఫౌజీ నుండి బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ లో పూనకాలు!

Fauji: ప్రభాస్ ఫౌజీ నుండి బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ లో పూనకాలు!
Advertisement

Fauji:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకొని.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas). రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తర్వాత అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రభాస్ ఈ ఏడాది ‘ ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఆయన కెరియర్ లోనే తొలిసారి హారర్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై నిర్మాతలు స్పందిస్తే తప్ప క్లారిటీ లేదు అని చెప్పవచ్చు.

ఫౌజీ నుండి అదిరిపోయే అప్డేట్..

ఇదిలా ఉండగా మరొకవైపు ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ఫౌజీ’.. సీతారామం సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ ఇన్ఫ్లోయెన్సర్, నృత్యకారిణి అయిన ఇమాన్వి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందని అభిమానులు ఎదురు చూడగా తాజాగా అదిరిపోయే అప్డేట్ ఒకటి అంచనాలు పెంచేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుండి గ్లింప్స్ ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉండగా అందులో రెండవ భాగం ప్రీక్వెల్ గా ఉండనుంది అని ఇటీవలే దర్శకుడు దృవీకరించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 ఆగస్టు 14న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

Advertisement

ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికొస్తే.. ఫౌజీ సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు ప్రభాస్. మరొకవైపు యానిమల్ , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్కును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అలాగే కల్కి 2898AD సీక్వెల్ తో పాటు సలార్ సీక్వెల్ లో కూడా ప్రభాస్ నటించనున్నారు. మొత్తానికైతే వరుస పాన్ ఇండియా చిత్రాలను ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ మరింత బిజీగా దూసుకుపోతున్నారు ప్రభాస్.

ALSO READ:Dimple Hayati: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి.. సిద్ధమైనట్టేనా?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×