E-Paper
Advertisement

Naa anveshana: రేణు దేశాయ్ కు మద్దతుగా నా అన్వేష్.. బెస్ట్ స్పీచ్ అంటూ!

Naa anveshana: రేణు దేశాయ్ కు మద్దతుగా నా అన్వేష్.. బెస్ట్ స్పీచ్ అంటూ!
Advertisement

Naa Anveshana: సినీ నటి రేణు దేశాయ్ ఇటీవల డాగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన తీరు సంచలనంగా మారింది. వీధి కుక్కలు కరుస్తున్నాయని వాటిని చంపటం దారుణం అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు, మరి కొంతమంది దోమలు కుట్టి కూడా చనిపోతున్నారు అలాంటిది కుక్కలు కరిచి చనిపోతే వాటిని చంపడం దారుణం అంటూ మాట్లాడటంతో రేణు దేశాయ్ తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇలా రేణు దేశాయ్ కుక్కలను చంపడం గురించి మాట్లాడటంతో చాలామంది ఆమె వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ ఈ ట్రోల్స్ పై కూడా స్పందించారు.

2026 బెస్ట్ స్పీచ్ ఇదే..

ఇక రేణు దేశాయ్ కుక్కలను చంపడం, దేశంలో జరుగుతున్న అవినీతి గురించి గురించి మాట్లాడటంతో ఎంతోమంది రేణు దేశాయ్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ(Naa Anveshana) కూడా రేణు దేశాయ్(Renu Desai) చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు అయితే ఈ వీడియోలో భాగంగా రేణు దేశాయ్ కి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేశారు. రేణు దేశాయ్ మాట్లాడినటువంటి వీడియో పట్లనా అన్వేషణ స్పందిస్తూ.. 2026లో బెస్ట్ స్పీచ్ ఇదే అంటూ ఆయన రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించారు.

అవినీతి కాకుండా అద్భుతాలు జరుగుతాయా..

Advertisement

ప్రస్తుతం ఈ దేశంలో జరుగుతున్న అవినీతి గురించి రేణు దేశాయ్ మాట్లాడటంతో ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈమె మరాఠీ ఆడపిల్ల అయినందుకు సాక్షాత్తు శివాజీ మహారాజ్ స్వయంగా రేణు దేశాయ్ ను ఆవహించి అన్ని విషయాల గురించి మాట్లాడేలా చేశారని అన్వేషణ తెలియజేశారు. ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో రెండు పార్టీలు మాత్రమే ఉంటాయి. కానీ భారతదేశంలో మాత్రం వేల సంఖ్యలో పార్టీలో ఉంటాయని, కొన్ని లక్షల మంది రాజకీయాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారని అన్వేషణ తెలిపారు. ఇలా లక్షల మంది రాజకీయాలపై బ్రతుకుతున్నప్పుడు అవినీతి కాకుండా, అద్భుతాలు జరుగుతాయా అంటూ ప్రశ్నించారు.

?igsh=ejJlYWFzdmg4OWs0

Advertisement

మనదేశంలో ఇలా రాజకీయ పార్టీల సంఖ్య పెరగటం వల్లే మితిమీరిన అవినీతి జరుగుతుందంటూ రేణు దేశాయ్ వ్యవస్థలోని లోపాలను బయట పెట్టడంతో అన్వేషణ రేణు దేశాయ్ కు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఈయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఏ అంశం అయితే వివాదంగా మారుతుందో అన్వేషణ ఆ వివాదం గురించి స్పందిస్తారని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలను తనకు అనుగుణంగా మార్చుకొని తన వ్యూస్ పెంచుకోవడంలో నా అన్వేషణ ముందు ఉంటారంటూ పలువురు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఇటీవల శివాజీ అనసూయ వివాదం గురించి నా అన్వేషణ స్పందించడంతో ఈయన పట్ల పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదం మర్చిపోకముందే మరోసారి రేణు దేశాయ్ కు మద్దతుగా నిలబడి మరోసారి వార్తల్లో నిలిచారు.

Also Read: Renu Desai: నీచంగా మాట్లాడుతున్నారు.. సోషల్ మీడియా ట్రోల్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×