E-Paper
Advertisement

Nari Nari Naduma Murari : రాజా సాబ్‌కు బ్యాడ్ న్యూస్… శర్వా చేతిలోకి ప్రభాస్ మూవీ థియేటర్స్..

Nari Nari Naduma Murari : రాజా సాబ్‌కు బ్యాడ్ న్యూస్… శర్వా చేతిలోకి ప్రభాస్ మూవీ థియేటర్స్..
Advertisement

Nari Nari Naduma Murari : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఖాతాలో గత కొన్నేళ్లుగా హిట్ సినిమా పడలేదు.. ఈ సంక్రాంతికి హిట్ కొట్టాడు. తాజాగా ఆయన నటించిన నారి నారి నడుమ మురారి ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పోటీ మరీ తీవ్రంగా ఉండటంతో కలెక్షన్ల పరంగా కొంచెం నెంబర్లు తక్కువగా కనిపిస్తున్నాయి తప్ప సినిమా మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయమే.. సినిమాలకు గ్యాప్ తీసుకున్న శర్వా రీఎంట్రీతోనే హిట్ కొట్టాడు.. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ఫుల్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం టీమ్ మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. మూవీ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

నారి నారి నడుమ మురారీ క్రేజీ అప్డేట్..

హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. సామజవరగమన ఫేం డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు.. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. పాజిటివ్ రెస్పాన్స్ తో దుమ్ము దులిపేస్తున్న ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా చిత్రం నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ పై ప్రాఫిట్ జోన్ అంతటా చెదిరిపోయింది.. ప్రేక్షకుల నవ్వులతో జరుపుకుంటున్న పండగ విన్నర్. అల్టిమేట్ సంక్రాంతి విన్నర్ నారి నారి నడుమ మురారి ఇప్పుడు మీకు సమీపంలోని మరిన్ని స్క్రీన్ ల పై ప్లే అవుతుందని ఆ పోస్టర్ పై ఉంది.

Advertisement

Also Read :స్టార్ క్రికెటర్ తో ఎఫైర్.. బ్రేకప్ పై బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

రాజా సాబ్ మూవీకి బ్యాడ్ లక్.. 

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి నుంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదని అర్థమవుతుంది. ఇక ఆ మూవీని చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్ నెట్టింట వినిపిస్తుంది. దాంతో కొన్ని థియేటర్లలో సినిమాను వెయ్యడం లేదని సమాచారం. ఆ థియేటర్లలో ఇప్పుడు నారి నారి నడుమ మురారి సినిమా ఆడుతుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ప్రభాస్ సినిమా థియేటర్లలో శర్వా మూవీ పడుతుంది. మొత్తానికి ఈ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టు పడిపోయింది. ఇదే జోరులో గనక ఈ సినిమా మరికొన్ని రోజులు రన్ అయితే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే.. బైకర్ సినిమాలో నటిస్తున్నాడు..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×