E-Paper
Advertisement

Durandhar 2 controversy: ‘ధురంధర్ 2’ సినిమా కష్టాలు..క్రెడిట్ కొట్టేద్దామనుకున్నాడు.. చివరకు సీన్ సితారైంది!

Durandhar 2 controversy: ‘ధురంధర్ 2’ సినిమా కష్టాలు..క్రెడిట్ కొట్టేద్దామనుకున్నాడు.. చివరకు సీన్ సితారైంది!
Advertisement

Durandhar 2 controversy: సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది.. “సక్సెస్ కి వందమంది వారసులు ఉంటారు, ఫెయిల్యూర్ కి ఎవరూ ఉండరు” అని. కానీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) నాయకుడు నబీల్ గబోల్ విషయంలో ఇది కొంచెం రివర్స్ అయింది. నిన్నటి దాకా “ఆ వెండితెర పాత్ర నాదే” అని కాలర్ ఎగురవేసిన గబోల్ , ఇప్పుడు అదే పాత్ర తనది కాదని మొత్తుకుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 అసలు మ్యాటర్ ఏంటంటే..

గతంలో ‘ధురంధర్’ సినిమా పార్ట్-1 వచ్చినప్పుడు, అందులో ‘జమీల్ జమాలీ’ అనే పాత్ర విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఆ పాత్ర తన జీవితం ఆధారంగానే రూపుదిద్దుకుందని నబీల్ గబోల్ అప్పట్లో తెగ మురిసిపోయారు.టీవీ ఇంటర్వ్యూల్లో “జనం నన్ను ఇప్పుడు నబీల్ అని పిలవడం మానేసి ‘జమీల్ జమాలీ’ అంటున్నారు” అని నవ్వుతూ ఇంటర్వ్యూలు ఇచ్చారు . ఇక సినిమా సక్సెస్ లో తన క్రెడిట్ కూడా ఉందని సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశారు కూడా .

 పార్ట్-2 తో మొదలైన అసలు ట్విస్ట్!

Advertisement

అయితే, సినిమా వాళ్లు ఊరికే ఉంటారా? తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’లో జమీల్ జమాలీ పాత్ర అసలు రంగు బయటపెట్టారు. సీక్వెల్‌లో ఆ పాత్రకు ఉన్న అండర్ వరల్డ్ సంబంధాలు, డార్క్ షేడ్స్, క్రిమినల్ కనెక్షన్లు చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు.ముఖ్యంగా పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ గందరగోళం మధ్య, ఒక సినిమా పాత్రను తనదిగా చెప్పుకోవడం ఇప్పుడు నబీల్ గబోల్ ప్రాణాల మీదకు తెచ్చింది.

 పాక్ ఆర్మీ వర్సెస్ గబోల్? నెటిజన్ల సెటైర్లు!

నబీల్ గబోల్ భయం వెనుక బలమైన కారణం ఉందని నెటిజన్లు అనాలసిస్ చేస్తున్నారు. ఆ పాత్రకున్న నెగటివ్ షేడ్స్ నిజంగానే తనకున్నాయని భావించి పాక్ ఆర్మీ మరియు నిఘా సంస్థలు తనను అదుపులోకి తీసుకుంటాయేమోనని ఆయన హడలిపోతున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం గట్టి విచారణ చేపడితే, తను గతంలో ఒప్పుకున్న స్టేట్‌మెంట్లే తనకు ఉరితాడుగా మారుతాయని గబోల్ వర్రీ అవుతున్నారు.

 నేను కాదు బాబోయ్!

Advertisement

దాంతో ఇప్పుడు ఏ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లినా.. “ఆ పాత్రకు నాకు అసలు సంబంధమే లేదు.. జమీల్ జమాలీ నాది కానే కాదు” అంటూ గట్టిగా వాదిస్తున్నారట. ఒకప్పుడు క్రెడిట్ కోసం ఆరాటపడి, ఇప్పుడు అదే పాత్ర తనది కాదని మొత్తుకుంటున్న ఆయన పరిస్థితి చూసి సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

సినిమా అనేది ఫిక్షన్. కానీ రాజకీయాల్లో పబ్లిసిటీ కోసం వెండితెర పాత్రలను ఓన్ చేసుకుంటే ఇలాంటి వింతైన చిక్కులే వస్తాయని గబోల్ ని చూస్తే అర్థమవుతోంది. మరి ఈ ‘ధురంధర్’ గండం నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారో చూడాలి!

also read:Sreeleela: వరుసగా 10 డిజాస్టర్లు..బుట్టబొమ్మ కంటే దారుణంగా శ్రీలీల పతనం?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×