E-Paper
Advertisement

Suriya 46: 45 ఏళ్ల వాడితో 20 ఏళ్ల పాప ప్రేమాయణం.. సూర్య మూవీ స్టోరీ లీక్ చేసిన నిర్మాత

Suriya 46: 45 ఏళ్ల వాడితో 20 ఏళ్ల పాప ప్రేమాయణం.. సూర్య మూవీ స్టోరీ లీక్ చేసిన నిర్మాత
Advertisement

Suriya 46: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన చివరిగా రెట్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా అనంతరం సూర్య వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈయన నటించిన కరుప్పు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ సినిమాతో పాటు సూర్య వెంకీ అట్లూరి (Venky Atluri)డైరెక్షన్లో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా సూర్య 46 సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు “విశ్వనాథన్ అండ్ సన్స్” (Vishwanthan and sons)అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.

మరో సంజయ్ రామస్వామి..

ఈ సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ద్వారా మరో సంజయ్ రామస్వామిని మనం చూడబోతున్నాము అంటూ ఇదివరకు డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమా గురించి వెల్లడించారు అయితే తాజాగా నిర్మాత నాగ వంశీ(Nagavamsi) ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ మొత్తం బయట పెట్టేశారు.. ఈ సినిమా 45 సంవత్సరాల వ్యక్తితో 20 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి మధ్య కొనసాగే ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని నిర్మాత నాగ వంశీ ఈ సందర్భంగా తెలియజేశారు.

2026 సమ్మర్ టార్గెట్..

Advertisement

ఈ సినిమాలో సూర్యకు జోడిగా నటి మమత బైజు  హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా 2026 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు విడుదల గురించి ఎలాంటి అధికారక ప్రకటన మాత్రం వెలబడలేదు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సూర్య తన తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఆవేశం డైరెక్టర్ తో సూర్య..

Advertisement

ఈ సినిమాతో పాటు మలయాళం దర్శకుడు జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి . ఈ సినిమాలో సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో నెగిటివ్ షెడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా సూర్య కనిపించబోతున్నట్టు ఇదివరకు ఈ సినిమా గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి . ఇక ఈ సినిమాలో నటి నజ్రియా హీరోయిన్ గా సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఆవేశం లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత జిత్తు మాధవన్ సూర్యతో సినిమా చేయబోతున్న విషయం తెలియడంతో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక త్వరలోనే సూర్య నటించిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×