E-Paper
Advertisement

TG TET Halltickets: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

TG TET Halltickets: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
Advertisement

TG TET Halltickets: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి. టెట్‌ హాల్ టికెట్లు వెబ్‌సైట్‌ లో ఉంచినట్లు విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థులు తెలంగాణ టెట్ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఆన్‌లైన్‌ లో పరీక్షలు నిర్వహించనున్నారు.

2.37 లక్షల దరఖాస్తు

టెట్ పేపర్‌-1, 2లకు మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. సర్వీస్ లో ఉన్న టీచర్లు సైతం టెట్‌ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో.. ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి. కేజీబీవీల్లో పని చేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులతో కలిపి దాదాపు 70 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 10-16 తేదీల మధ్య టెట్ ఫలితాలను విడుదల చేస్తామని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

Advertisement

అభ్యర్థులు టీజీ టెట్ అధికారిక వెబ్ సైట్ https://tgtet.aptonline.in/tgtet/ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

TG TET 2026 హాల్ టికెట్ డౌన్ లోడ్

అభ్యర్థులు టీజీ టెట్ tgtet.aptonline.in/tgtet/ వెబ్‌సైట్‌ను సందర్శించండి
“హాల్ టికెట్ డౌన్‌లోడ్” లింక్‌పై క్లిక్ చేయండి.
జర్నల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ కు వివరాలను సమర్పించండి.
అభ్యర్థి వివరాలు ధృవీకరించి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

Advertisement

టీజీ టెట్ పేపర్ 1, పేపర్ 2లను మొత్తం 150 మార్కుల నిర్వహిస్తారు. 1 నుండి 8 తరగతులకు బోధించాలనుకునే అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది.

  • పేపర్ 1: 1 నుండి 5 తరగతుల టీచింగ్ కోసం
  • పేపర్ 2: 6 నుండి 8 తరగతుల టీచింగ్ కోసం

TG TET 2026 ఉత్తీర్ణత శాతాలు

  1. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు : 60%, అంతకంటే ఎక్కువ
  2. బీసీ: 50%, అంతకంటే ఎక్కువ
  3. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు: 40%, అంతకంటే ఎక్కువ

టెట్ అర్హత సర్టిఫికేట్ జీవితాంతం చెల్లుబాటులో ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో టెట్ స్కోర్‌కు 20% వెయిటేజీ ఉంటుంది.

Also Read: TGSRTC Recruitment: టీజీఎస్ఆర్టీసీలో 198 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×