E-Paper
Advertisement

‘లెనిన్’ విడుదల పై నాగార్జున క్లారిటీ.. ‘పెద్ది’ నీ ఢీ కొట్టబోతున్న అఖిల్!

‘లెనిన్’ విడుదల పై నాగార్జున క్లారిటీ.. ‘పెద్ది’ నీ ఢీ కొట్టబోతున్న అఖిల్!
Advertisement

Lenin Film: అక్కినేని హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటివరకు సరైన సక్సెస్ లేక ఎంతో సతమతమవుతున్నారు నటుడు అఖిల్. దాదాపు దశబ్ద కాలంలో ఐదు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఏ ఒక్క సినిమా ద్వారా సరైన సక్సెస్ మాత్రం అందుకు లేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మంచి సక్సెస్ అందుకోవాలని అఖిల్ లెనిన్ (Lenin)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తుంది. అదేవిధంగా పెద్ది సినిమా విడుదల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.

పెద్దితో పోటీకి సై అంటున్న అఖిల్..

ఈ సినిమాని మే 1 వతేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలియచేశారు. అయితే అనుకోకుండా పెద్ది సినిమా ఏప్రిల్ 30 విడుదల కాబోతుందని ప్రకటించడంతో తప్పనిసరి పరిస్థితులలో లెనిన్ సినిమా జూన్ 26వ తేదీకి వాయిదా వేసుకున్నారు అయితే ఏప్రిల్ 30న విడుదల కావలసిన పెద్ది(Peddi) సినిమా తిరిగి వాయిదా పడుతూ జూన్ 25వ తేదీ విడుదల కాబోతుందని వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా జూన్ 25న పెద్ది రాబోతోందని తెలియజేశారు.

కొత్త అఖిల్ ను చూడబోతున్నారు..

Advertisement

ఇలా పెద్ది సినిమా జూన్ 25న రాబోతోంది అంటూ ప్రకటించడంతో మరోసారి అఖిల్ అక్కినేని(Akhil Akkineni)లెనిన్ సినిమాని వాయిదా వేసుకోవాల్సిందే అంటూ అభిమానులు భావించారు అయితే తాజాగా అక్కినేని నాగార్జున(Nagarjuna) లెనిన్ సినిమా విడుదల గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నాగార్జున లెనిన్ సినిమా ఫస్ట్ హాఫ్ చూసానని 2026లో సరికొత్త అఖిల్ ను చూడబోతున్నారని తెలియజేశారు. ఈ సినిమా జూన్ 26 తేదీ విడుదలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటుంది అంటూ నాగార్జున తెలియజేశారు.

Advertisement

ఈ విధంగా నాగార్జున లెనిన్ సినిమా జూన్ 26న రాబోతుందని ప్రకటించడంతో ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని పెద్ది సినిమాతో పోటీ పడుతూ అఖిల్ బరిలో దిగబోతున్నారని తెలుస్తోంది. పలు సందర్భాలలో అఖిల్ చరణ్ కోసం తన సినిమాని వాయిదా వేసుకున్నప్పటికీ ఈసారి మాత్రం పోటీకి సై అంటున్నారని చెప్పాలి. ఇక అఖిల్ లెనిన్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ జోడిగా భాగ్యశ్రీ హీరోయిన్గా నటించారు రాయలసీమ లవ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా ఈ రెండు పాటలకు ఎంతో మంచి ఆదరణ లభించింది.

Also Read: సాంప్రదాయ పద్ధతిలో బెల్లంకొండ శ్రీనివాస్ హల్దీ వేడుక..వీడియో వైరల్!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×