E-Paper
Advertisement

నాగర్‌కర్నూల్‌లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతన్నలు!

నాగర్‌కర్నూల్‌లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతన్నలు!
Advertisement

Nagarkurnool: స్వేచ్ఛ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో రాంనగర్, హౌసింగ్ బోర్డ్, ప్రధాన రహదారిపై కొన్ని చెట్లు విరిగిపడ్డాయి. జిల్లాలోని వంకేశ్వరంలో 18మిల్లీ మీటర్లు, వెల్టూరు, కుమ్మెర గ్రామాల్లో దాదాపు 17మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపారుల సామగ్రి ఎగిరిపోయింది. దీంతో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం వరకూ చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్ కో అధికారులు చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్నలు వర్షానికి తడిచిపోయాయి.

మాజీ ఎమ్మెల్యే మర్రి ధర్నా

Advertisement

అకాల వర్షానికి తడిపిన మొక్కజొన్న, వేరుశనగ, వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. గత 25 రోజులుగా మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఫలితంగా కష్టపడి పండించిన పంటను పోగొట్టుకునే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని తమ వెన్నంటే అండగా ఉంటామని ప్రభుత్వం దిగివచ్చి పంటను కొనుగోలు చేసేదాకా పోరాడుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రతి గింజనూ కొంటాం ఎంఎల్సీ దామోదర్ రెడ్డి

Advertisement

ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. జిల్లాలో 1లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని,‌ భారీగా యార్టుకు మొక్కలు వస్తున్నాయని తెలిపారు. ఆకస్మికంగా కురిసిన వర్షానికి మొక్కలు తడిచాయని, రైతుల మొక్కజొన్నలు అంతా కొనుగోలు చేస్తామన్నారు. రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దన్నారు.

Also Read:ఫోన్ ట్యాపింగ్ కేసులో A1, A2, A3 వారే.. కేసీఆర్ ఫ్యామిలీపై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Related News

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

Big Stories

Advertisement
×