E-Paper
Advertisement

కింగ్ 100 వ సినిమా నాగ్ కీలక అప్డేట్…ఆ సెంటిమెంట్ తో హిట్ కొట్టబోతున్నాడా?

కింగ్ 100 వ సినిమా నాగ్ కీలక అప్డేట్…ఆ సెంటిమెంట్ తో హిట్ కొట్టబోతున్నాడా?
Advertisement

Nagarjuna 100: అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఆర్ కార్తీక్ దర్శకత్వంలో తన కెరియర్ లోనే ఎంతో ప్రత్యేకమైన సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నాగార్జున కెరియర్లో 100వ సినిమాగా ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఇలా తన కెరీర్లో మైలురాయిగా నిలవబోతున్న ఈ సినిమా విషయంలో నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని షూటింగ్ పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న విషయం కూడా బయటకు రాకుండా షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

కమర్షియల్ సినిమాగా నాగ్ 100 మూవీ..

ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా నాగార్జున ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా పక్క కమర్షియల్ సినిమా అని, ఏమీ లేని స్థితి నుంచి కోటీశ్వరుడుగా హీరో ఎదిగిన విధానాన్ని ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ కథకు అనుగుణంగా నాగార్జున 25 సంవత్సరాలు, 60 ఏళ్ల వ్యక్తిగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని సమాచారం.

తండ్రి కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో..

Advertisement

ఇక ఈ కథ మొత్తం తండ్రి కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో ఉండబోతుందని నాగార్జున (Nagarjuna) తెలిపారు. ఇప్పటికే 45 శాతం షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా తండ్రీ కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలియడంతో ఈ సెంటిమెంట్ తో నాగ్ హిట్ కొట్టగలడా? అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తండ్రి కూతురి బాండింగ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక నాగార్జున ఇదివరకు తండ్రి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో సినిమాలు చేశారు మొదటిసారి కూతురు సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.

నాగార్జునకు జోడిగా ముగ్గురు హీరోయిన్లు..

Advertisement

ఇక ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ నటి టబు(Tabu) ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే .ఈ విషయాన్ని నాగార్జున పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు. ఈమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిలో సుస్మిత భట్, ఐశ్వర్య రాజేష్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన మాత్రం తెలియచేయలేదు. మరి ఈ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమా నాగార్జున కెరీర్లో 100వ సినిమా కావడంతో స్వయంగా ఈ సినిమాకు నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పూనమ్ పాండే… సీరియస్ గా తీసుకోవద్దు..జస్ట్ చిల్ అంటూ!

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×