E-Paper
Advertisement

చెరువు కబ్జాకోసం రోడ్డుతో స్కెచ్.. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు మౌనరాగంలో అధికారులు..?

చెరువు కబ్జాకోసం రోడ్డుతో స్కెచ్.. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు మౌనరాగంలో అధికారులు..?
Advertisement

Illegal Expansion: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ పరిధిలోని రావల్‌కోల్ గ్రామం సర్వే నంబర్ 80లో ఉన్న నల్లవాని కుంట వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే కుంట పరిధిని ఆక్రమిస్తూ 40 అడుగుల వెడల్పుతో దారి నిర్మాణం చేపట్టడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. కుంట పక్కన భారీ యంత్రాలతో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి.

గ్రామస్తులు ఆందోళన

దశాబ్దాల నాటి చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తూ, కుంట పరిధిని తవ్వి రహదారి విస్తరణ చేపడుతున్నారు. దీనివల్ల సహజ నీటి ప్రవాహం దెబ్బతినే ప్రమాదం ఉందని, వర్షాకాలంలో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖకు చెందిన కుంటలో పనులు చేపట్టాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. అలాగే చెట్ల నరికివేతకు అటవీ శాఖ అనుమతి అవసరం. అయితే ఈ రెండింటినీ పూర్తిగా విస్మరించి పనులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయా? లేక నిర్లక్ష్యమే కారణమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Advertisement

Also Read: మహిళలే యజమానులు.. ప్రతి మండలానికి ఆర్టీసీ బస్సు.. జూన్ 2 నుంచి కొత్త ప్రయాణం!

అనుమానాలు వ్యక్తం..

కుంటను కబ్జా చేస్తూ దారి విస్తరణ చేపట్టడం వెనుక భూకబ్జాదారుల చేతి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా భూములను భవిష్యత్తులో లేఅవుట్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ముందస్తు చర్యలే చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికైనా ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పనులను నిలిపివేయాలని, కుంటలను రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: Office Misconduct: రైతు కార్యాలయంలో మందు పార్టీ రచ్చ రచ్చ.. బరితెగించిన ఉద్యోగులు

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×