BigTV English

Balakrishna in Squid Game: స్క్విడ్ గేమ్‌లో బాలయ్య, అనసూయ.. పాపం రాజీవ్ కనకాల, ఎండింగ్ అదుర్స్

Balakrishna in Squid Game: స్క్విడ్ గేమ్‌లో బాలయ్య, అనసూయ.. పాపం రాజీవ్ కనకాల, ఎండింగ్ అదుర్స్

Balakrishna Plays Squid Game: ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ఈ దక్షిణ కొరియో వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొంది. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ సీరిస్ లో క్షణక్షణంగా ఉత్కంఠ పెంచుతూ ఆడియన్స్ చూపు చూపు తిప్పుకోకుండ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సరీస్ మూడు సీజన్లుగా విడుదలైంది. ప్రతి సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓటీటీ లో అత్యధిక వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలిచింది. అన్ని దేశాల్లోనూ ఈ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ ఉంది.


బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..

ఓటీటీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ లో మన తెలుగు స్టార్స్ నటిస్తే ఎలా ఉంటుంది. అదీ కూడా అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ ఈ స్క్విడ్ గేమ్ ఆడితే రూల్స్ అన్ని మాయం అవ్వాల్సిందే. కాగా ఈ మధ్య ఏఐ వాడకం బాగా పెరిగి పోయింది. దీని ద్వారా తమ అభిమానుల నటులను తమకు ఇష్టమైన పాత్రల్లో చూసుకుంటు మురిసిపోతున్నారు. మూవీలో హీరో లుక్స్ ని ముందుగానే ఏఐ ద్వారా చూసేస్తున్నారు.వారి పాత్రల పేరు బయటకు వస్తే చాలు.. ఏఐకి పని చెప్పేస్తున్నారు. మూవీ టీం నుంచి అప్డేట్ కు ముందే తమ హీరోల లుక్స్ ఏఐ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ29 లోని మహేష్ లుక్, ఇంకా సెట్స్ పైకి రాని స్పిరిట్ మూవీలో ప్రభాస్ లుక్ లను ఏఐ సాయంతో క్రియేట్ చేసి వైరల్ చేశారు.


పాపం రాజీవ్ బలి

మొన్నటికి మొన్న పుష్ప లో మహేష్ బాబు నటిస్తే ఎలా ఉంటుందో ఏఐతో ఎడిట్ చేసి వైరల్ చేశారు. ఇప్పుడు తాజాగా ఏకంగా కొరియన్ వెబ్ సిరీస్ లో మొత్తం మన తెలుగు స్టార్స్ ని ఏఐతో ఎడిట్ చేశారు. ప్రముఖ వెబ్ సిరీస్ గా గుర్తింపు పొందిన స్క్విడ్ గేమ్ లో మన తెలుగు స్టార్స్, హీరోలను ఏఐ సాయంతో రూపొందించారు. నందమూరి బాలకృష్ణ, నటి అనసూయ, నటుడు రాజీవ్ కనకాల స్క్వీడ్ గేమ్ ఆడినట్టుగా రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అనసూయలు స్క్విడ్ గేమ్ ఆడి గెలిచినట్టు చూపించారు.  కానీ, రాజీవ్ కనకాలను ఒడినట్టు చూపించి అతడిని బలి చేశారు.

బాలయ్య మ్యానరిజం అదుర్స్

ఎప్పటిలాగే ఇందులోను బాలయ్య మ్యానరిజం చూపించారు. స్క్విడ్ గేమ్ లో పాల్గొన్న ఆయన చికాకు వచ్చి ఆటను వదిలేస్తాడు. ఇక ఆయనను చంపడానికి వచ్చిన వారితో తనదైన స్టైల్లో యాక్షన్ కి దిగాడు. ఇక చివరిలో బోయపాటి సినిమా రేంజ్ యాక్షన్ చూపించారు. ఒకేసారి అందిరిని గుంపుగా గాల్లోకి లేపి మట్టుకరిపిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ బాలయ్య యాక్షన్ లో తగ్గేదే లే అంటున్నారు.ఇక ‘రాజీవ్ కనకాల పాత్రలు చావడం తప్ప ఇంకేమి లేదని, సినిమాల్లో అదే పాత్ర, స్క్విడ్ గేమ్ లోనూ అదే’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ అనసూయ కూడా హైలైట్‌గా నిలిచింది. గేమ్ గెలిచిన అనంతరం తన క్లోజప్ రియాక్షన్స్‌తో స్క్విడ్ గేమ్‌లో ఒక రియల్ పాత్రలను తలపించేలా కనిపించి ఆకట్టుకున్నారు.

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×