Madhavan: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నటుడు మాధవన్(Madhavan) ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన “ఆప్ జైసా కోయి” (Aap Jaisa Koi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మాధవన్ సరసన ఫాతిమా సనా షేక్ (Fathima Sana Shaik)నటించి సందడి చేశారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు మాధవన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా ఈయన నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.
హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ప్రియాంక..
ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సింగర్ ను పెళ్లి చేసుకుని హాలీవుడ్(Hollywood) ఇండస్ట్రీలోనే స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఈమె బాలీవుడ్ సినిమాలను కూడా పూర్తిగా తగ్గించారు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా గురించి మాధవన్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
హెడ్స్ ఆఫ్ స్టేట్..
ముఖ్యంగా ప్రియాంక చోప్రా నటించిన “హెడ్స్ ఆఫ్ స్టేట్ (Heads Of State)సినిమా గురించి మాధవన్ మాట్లాడారు.”ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కు వెళ్లి అక్కడ ఇంత పెద్ద సినిమాలో ప్రధాన పాత్రను చాలా సునాయసంగా చేసిందని తెలిపారు. యాక్షన్స్ సన్ని వేషాలలో అద్భుతంగా నటించారని తెలిపారు. ఇండియాలో ఉన్న సగం మంది హీరోలు ఇలాంటి సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు” అంటూ ఈ సందర్భంగా మాధవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రియాంక చోప్రా ఇటీవల పెద్ద ఎత్తున హాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఈమె తెలుగు ప్రాజెక్టుకు కమిట్ అయ్యారు ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే.
పాన్ వరల్డ్ స్థాయిలో..
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) ప్రధాన పాత్రలో ఓ అడ్వెంచరస్ మూవీగా రాబోతున్న సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా SSMB 29 వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇందులో ప్రియాంక చోప్రా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలోనే హాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రాను ఈ ప్రాజెక్టులో భాగం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం పలు షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని మహేష్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే మహేష్ బాబు పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Vaishnavi Chaitanya: మెదక్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభించిన వైష్ణవి చైతన్య!