E-Paper
Advertisement

నందమూరి నాలుగో తరం వారసుడి ఎంట్రీకి ‘వైవీఎస్’ గ్రహణం? .. అడ్రస్ లేకుండా పోయిన ప్రాజెక్ట్!

నందమూరి నాలుగో తరం వారసుడి ఎంట్రీకి ‘వైవీఎస్’ గ్రహణం? .. అడ్రస్ లేకుండా పోయిన ప్రాజెక్ట్!
Advertisement

Nandamuri Debut:నందమూరి వంశం నుండి వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఎలా ఉండాలి? అంచనాలు ఆకాశంలో ఉండాలి. నిజానికి వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ మనవడు, జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడంటే అంచనాలు భారీగానే పెరిగిపోయాయ్. ఇంకేం మా నందమూరి వంశం నుండి మరో నట వారసుడు వచ్చేస్తున్నాడు అంటూ మురిసిపోయారు నందమూరి అభిమానులు.

2025 మే 12న ఎన్టీఆర్ ఘాట్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్‌

Advertisement

2024 జూన్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ నందమూరి తారక రామారావు హీరోగా తెలుగుతనం ఉట్టిపడే సినిమా తీస్తున్నానని భారీ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ నొక్కి చెప్పాడు వైవీఎస్ చౌదరి. ఇక 2024 అక్టోబర్‌లో తారక్ తన అన్న కొడుక్కి విష్ చెబుతూ పోస్ట్ చేయడం తెల్సిందే. ఆ తర్వాత 2025 మే 12న ఎన్టీఆర్ ఘాట్ వద్ద గ్రాండ్ గా సినిమా ఓపెనింగ్‌కి నందమూరి కుటుంబం మొత్తం విచ్చేసి దీవించడంతో, ఇక ఈ వారసుడి దూకుడు మొదలవుతుందనుకున్నారంతా.

also read:మెగాస్టార్ ఆగిపోయిన సినిమా వెనుక ఆ హీరోయిన్! రజనీకాంత్‌తో చిరు విలన్ గా మారడానికి అసలు కారణం ఇదేనా?

Advertisement

అసలు సినిమా ఉందా లేక మధ్యలోనే ఆపేశారా

కానీ ఏప్రిల్ 2026 నాటికి ముహూర్తం జరిగి ఏడాది గడుస్తున్నా సినిమా ఎంతవరకొచ్చిందో, ఏంటోనన్న కనీస ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాకపోవడంతో అసలు సినిమా ఉందా లేక మధ్యలోనే ఆపేశారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్. సాధారణంగా నందమూరి లాంటి పెద్ద కుటుంబానికి చెందిన హీరో పరిచయం అవుతున్నప్పుడు ఏదో ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కామన్. కానీ భారీ స్థాయిలో సినిమా ఉంటుందని ఊదరగొట్టిన వైవీఎస్ చౌదరి ఇప్పుడు సైలెంట్ అవడం నందమూరి ఫ్యాన్స్‌కి అస్సల్ మింగుడు పడటం లేదు.

వీఎస్ చౌదరిని పక్కన పెట్టేసి మరో కుర్ర డైరెక్టర్?

ఒకప్పుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పటికీ, చివరగా తీసిన ‘సలీమ్’, ‘రేయ్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్స్‌గా నిలిచిపోయాయ్. ముఖ్యంగా సాయి దుర్గా తేజ్ తొలి సినిమాగా వచ్చిన ‘రేయ్’ ఈ మెగా హీరోకి ఓ నైట్ మేర్‌లా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు అసలే ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. వీ వాంట్ కొత్తదనం అంటూ పాత కంటెంట్‌కి రాం రాం చెప్పేస్తున్నారు. మరి ఈ టైమ్‌లో వైవీఎస్ చౌదరి గత ట్రాక్ రికార్డ్ చూసి రిస్క్ చేయలేక నందమూరి ఫ్యామిలీ సినిమా ఆపేసిందా లేక స్క్రిప్ట్ చేంజెస్ ఏమైనా చెప్పారా అన్నది తెలియాలి. మరోవైపు ఈ సినిమాకి వైవీఎస్ చౌదరిని పక్కన పెట్టేసి మరో కుర్ర డైరెక్టర్ ని లైన్లోకి తెస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది.

ఇప్పుడున్న కాంపిటీషన్ లో తొలి సినిమానే బోల్తా కొడితే

ఇక ఈ సినిమాలో నందమూరి తారక రామారావుకి జోడీగా ఈ సినిమాతో వీణారావు ఇంట్రొడ్యూస్ అవుతుండగా, వైవీఎస్ చౌదరి తన సొంత బ్యానర్ ‘బొమ్మరిల్లు’ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఏది ఏమైనా కళ్యాణ్ రామ్, తారక్ లు జానకి రామ్ కుమారుడి లాంచింగ్ విషయంలో ఖచ్చితంగా ఉంటారన్నది వాస్తవం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడున్న కాంపిటీషన్ లో తొలి సినిమానే బోల్తా కొడితే తిరిగి రికవర్ అవ్వడం చాలా కష్టమన్నది వాళ్ళకి తెలీందేం కాదు. చూడాలి మరి సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్న ఈ సైలెన్స్ ని చౌదరి గారు ఎలా బ్రేక్ చేస్తారో!

also read:ప్లాప్ డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ రిస్క్…వర్కౌట్ అయ్యేనా ?

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×