E-Paper
Advertisement

Ayashere Song Promo: నాని ‘ప్యారడైజ్’ నుంచి ‘ఆయాషేర్’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఇది అరాచకమే..

Ayashere Song Promo: నాని ‘ప్యారడైజ్’ నుంచి ‘ఆయాషేర్’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఇది అరాచకమే..
Advertisement

Ayashere Song Promo: నేచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఫ్యారడైజ్’ (Paradise) చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, నానిని ఒక కొత్త మాస్ యాంగిల్‌లో ఆవిష్కరించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘ఆయాషేర్’ సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ పాటకు సంబంధించి ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు అంచనాలు పెంచేశాయి. టైటిల్ సాంగ్ కావడంతో ఈ పాటను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంది మూవీటీం. ఈ పాట్ విడుదల కోసం నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.

Read also-AA22 Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. అట్లీ సినిమా అప్టేట్ ఎప్పుడంటే?

Advertisement

ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. నాని-అనిరుధ్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ‘ఆయాషేర్’ పాట కోసం అనిరుధ్ ఒక హై-వోల్టేజ్ మాస్ ట్యూన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ప్రోమో విడుదల కావడంతో నాని ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఈ పాట పేరులోని ‘షేర్’ (సింహం) అనే పదం చూస్తుంటే, ఇది నాని క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసే ఒక పవర్‌ఫుల్ ఎంట్రీ సాంగ్ లేదా యాంథమ్‌లా ఉండబోతోందని స్పష్టమవుతోంది. అనిరుధ్ మార్క్ బీట్స్, నాని ఎనర్జీ తోడైతే ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయం. ఇప్పటికే విడుదలైన ప్రోమోను చూస్తుంటే మాస్ ప్రేక్షకులను మెప్పించేదిలా ఉంది.

Read also-Priyanka Chopra : బ్యాక్ లెస్ లుక్ లో ప్రియాంక.. డ్రెస్ ధర తెలిస్తే అవాక్కే..!

Advertisement

శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే రా అండ్ రస్టిక్ మేకింగ్‌లో తనదైన ముద్ర వేశారు. ‘ఫ్యారడైజ్’ చిత్రంతో ఆయన మరింత భారీ స్థాయిలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. నాని ఈ సినిమాలో ఒక వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తారని, కథాంశం కూడా చాలా కొత్తగా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. ఫిబ్రవరి 24న రాబోయే ఫుల్ సాంగ్ సినిమా మూడ్ ఎలా ఉండబోతుందో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, అనిరుధ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘ఆయాషేర్’ పాటతో ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున ప్రారంభం కానున్నాయి. 2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యారడైజ్’ ఒక సరికొత్త రికార్డును సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడైపోయాయి.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×