E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: నాగర్ కర్నూల్ జిల్లాలో.. పసిబిడ్డ మృతి పై స్పందించిన కల్వకుంట్ల కవిత..!

Kalvakuntla Kavitha: నాగర్ కర్నూల్ జిల్లాలో.. పసిబిడ్డ మృతి పై స్పందించిన కల్వకుంట్ల కవిత..!
Advertisement

Kalvakuntla Kavitha: పసి బిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మృతి అమానుషమని అన్నారు. జాతరకు వెళ్లిన రజక దంపతులు గణేశ్(Ganesh), మౌనిక(Mounika), రెండు నెలల వారి పసి బిడ్డ, తల్లి, చెల్లిపై దాడి చేయగా ఈ దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని తెలిపారు. బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

రజక కుటుంబం పై దాడి..

దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎస్పీకి కవిత ఫోన్ చేసి మాట్లాడారు. కుమ్మెర జాతరలో కులవివక్షతో రజక కుటుంబం పై దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: UGC Fake Universities: ఈ 32 యూనివర్సిటీలు ఫేక్.. ఏపీలో రెండు

తెలంగాణ ఆత్మను చాటిన గాడ్స్ ఇన్ ది వాయిస్..

తెలంగాణ ఒగ్గు కథను ప్రపంచానికి చాటేలా, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ‘గాడ్స్ ఇన్ ది వాయిస్’ డాక్యుమెంటరీ కల్చర్ ఫిల్మ్ రూపొందించారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో డాక్టర్ జి. కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్స్ ఇన్ ది వాయిస్’ టీజర్ ను లాంచ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, మూవీ యూనిట్ సభ్యులు ప్రొఫెసర్ జోలి పోతుసెర్రి, మేఘా యాదవ్, మహేశ్వర్, జయదేవ్ యాదవ్, సాయి రుద్రకాంత్, తిరుపతి యాదవ్, కవిత యాదవ్, రాజ్ కుమార్, శ్రీణిక, గనికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: RTC Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ఆర్టీసీ బస్సు, ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×