Nani: టాలీవుడ్‌లో సహజ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాని ఇటీవల సోషల్ మీడియాలో అనుకోని వివాదంలో నిలిచారు. సాధారణంగా సింపుల్ స్వభావం.. అభిమానులతో మర్యాదగా వ్యవహరించే వ్యక్తిగా పేరున్న నాని గురించి వచ్చిన ఒక చిన్న వీడియో క్లిప్ పెద్ద చర్చకు దారి తీసింది.
ఇటీవల నాని పుట్టినరోజు సందర్భంగా జరిగిన అభిమానుల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాని నల్ల రంగు దుస్తుల్లో కనిపిస్తూ అభిమానులతో నవ్వుతూ ఫోటోలు దిగారు. ఈ సమయంలో కొంతమంది అభిమానులు ఆయనకు చేతులు చాచి హ్యాండ్‌షేక్ చేయాలని ప్రయత్నించారు. అయితే వైరల్ అయిన చిన్న వీడియోలో నాని వెంటనే వారి చేతులు పట్టుకోకుండా ఫోటోలకే పోజ్ ఇవ్వడం కనిపించింది. అంతేకాదు అభిమాని ఎంత అడిగినా కూడా.. అతని చెయ్యి తాకకుండా ముందు ఫోటో సాగి చూడు అన్నట్లు సైగ చేశారు. ఈ దృశ్యం వీడియోలో రెండు సార్లు కనిపించడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నానిపై విమర్శలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు అహంకారం బయటపడింది.. అంటూ కామెంట్లు పెట్టగా, మరికొందరు.. మరి ఇంతలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని అని విమర్శించారు. ఇంకొందరు అయితే హద్దులు దాటి అనవసర ఆరోపణలు కూడా చేశారు. దీంతో నాని పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది.
Nani might have had his own reasons… Bashing him for this is totally unacceptable!!🙁
— Christopher Kanagaraj (@Chrissuccess) February 25, 2026
అయితే ఈ విమర్శలకు.. విరుద్ధంగా.. నానిని సమర్థించే వారు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. సెలబ్రిటీలు ప్రతి ఒక్కరితో తప్పనిసరిగా చేతులు కలపాల్సిన అవసరం లేదని వారు అన్నారు. వ్యక్తిగత పరిమితులు, ఆరోగ్య భద్రత, అలసట వంటి కారణాల వల్ల కొన్నిసార్లు ఇలా జరగవచ్చని వివరించారు. ఒక చిన్న వీడియో చూసి మొత్తం వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరైంది కాదని వారు అభిప్రాయపడ్డారు.
అయితే ఈ వీడియో తర్వాత మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో రావడంతో.. ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఆ పూర్తి వీడియోలో ఫోటో దిగిన తర్వాత నాని అదే అభిమానితో చేతులు కలిపిన దృశ్యం కనిపించింది. దీంతో మొదట వైరల్ అయిన వీడియోను కట్ చేసి పెట్టారని, కావాలనే నానిని తప్పుగా చూపించారని అభిమానులు ఆరోపించారు.
మొత్తానికి..ఒక చిన్న క్లిప్ వల్ల మొదలైన ఈ వివాదం నిజం పూర్తిగా బయటపడడంతో క్రమంగా తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను పూర్తిగా చూసి, నిజానిజాలు తెలుసుకుని స్పందించడం మంచిదని.. ఈ విషయం మరోసారి రుజువు చేసింది.
ALSO READ: Vaishnavi Chaitanya: కోలీవుడ్ లోకి అడుగు పెట్టిన బేబీ బ్యూటీ..పూర్తి డీటెయిల్స్ ఇవే!