E-Paper
Advertisement

Nani-Sujeeth: షూటింగే మొదలు కాలేదు.. ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న నాని మూవీ?

Nani-Sujeeth: షూటింగే మొదలు కాలేదు.. ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న నాని మూవీ?
Advertisement

Nani -Sujeeth: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ (The Paradise)సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని 2026 మార్చ్ లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని మార్చిలో కాకుండా మే నెలలో విడుదల కాబోతుందని వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే నాని తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సుజిత్ (Sujeeth)తో చేయబోతున్న విషయం తెలిసిందే.

గన్స్ ఎన్ రోజెస్..

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో డైరెక్టర్ సుజిత్ బిజీగా ఉన్నారు. ది ప్యారడైజ్ సినిమా పనులు పూర్తి కాగానే నాని సుజిత్ సినిమా పనులలో బిజీ కానున్నారు. ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజానికి ఈ సినిమాకి బ్లడీ రొమియో అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని అందరూ భావించారు కానీ తాజాగా ఈ సినిమాకు గన్స్ ఎన్ రోజెస్ అనే మరొక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ఈ వార్త బయటకు రావడంతో ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకు ఏదైనా సంబంధం ఉందా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్..

Advertisement

ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్ల సమాచారం. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ ఓటీటీ డీలింగ్ పూర్తి అయినట్టు సమాచారం. ఎప్పటిలాగే ఈ సినిమా హక్కులను భారీ ధరలకు నెట్ ఫ్లిక్స్ (Net Flix)కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకుండానే నాని సినిమాకు ఓటీటీ డీల్ పూర్తి కావడం చూస్తుంటే నాని సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

2026 డిసెంబర్ లో విడుదల..

Advertisement

ఇటీవల నాని నటించిన సినిమాలన్నింటిని దాదాపు నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంటున్నారు. ఎప్పటిలాగే నాని సుజిత్ సినిమా డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2026 డిసెంబర్ మూడో తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నానికి జోడిగా నటి పూజా హెగ్డే (Pooja Hegde) నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ విషయం గురించి కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Also Read: Annagaru Vostaru Release: డిసెంబర్లోనే ‘ అన్నగారు వస్తారు’ రిలీజ్ డేట్ లాక్!

Related News

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!

రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

Big Stories

Advertisement
×