E-Paper
Advertisement

IND VS SA 1st ODI: ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌ను బండ‌బూతులు తిట్టిన కోహ్లీ.. షాకింగ్ వీడియో ఇదిగో

IND VS SA 1st ODI: ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌ను బండ‌బూతులు తిట్టిన కోహ్లీ.. షాకింగ్ వీడియో ఇదిగో
Advertisement

IND VS SA 1st ODI: ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో భారత్ ని విజయపథంలో నడిపించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా కి తగిన సమాధానం ఇచ్చాడు కోహ్లీ. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా పై భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది.

Also Read: Palash Muchhal: చేసిందంతా చేసి, ఇప్పుడు సింప‌తి కోసం ప‌లాష్ కొత్త డ్రామాలు… సుద్ద‌పూస‌లాగా మారీ!

Advertisement

దీంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ 1 – 0 ఆధిక్యంలో ఉంది. ఈ తొలి వన్డేలో సెంచరీతో విరాట్ కోహ్లీ తన 52వ వన్డే సెంచరీ, అంతర్జాతీయ కెరీర్ లో 83వ సెంచరీని సాధించాడు. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.

 

దక్షిణాఫ్రికా ప్లేయర్లను బండ బూతులు తిట్టిన విరాట్ కోహ్లీ:

Advertisement

టీమిండియా నిర్దేశించిన 350 పరుగులను ఛేదించేందుకు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కి దిగింది. ఈ క్రమంలో 77 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే 14.6 ఓవర్ల వద్ద నాలుగో వికెట్ కోల్పోయే సమయంలో.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో టోనీ ఎల్బిడబ్ల్యు గా పెవిలియన్ చేరతాడు. ఈ క్రమంలో అంపైర్ నిర్ణయం కోసం ఆటగాళ్లంతా ఒక దగ్గర చేరి వేచి చూస్తున్నారు. అయితే టోనీ అవుట్ అని అంపైర్ ప్రకటించిన సమయంలో.. విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా ప్లేయర్లపై బండ బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. దీంతో కోహ్లీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సౌత్ ఆఫ్రికా హెడ్ కోచ్ కి నో షేక్ హ్యాండ్:

సౌత్ ఆఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తూనే ఉన్నాయి. విలేకరుల సమావేశంలో రెండవ టెస్ట్ లోని రెండవ ఇన్నింగ్స్ ని ఎందుకు ఆలస్యంగా డిక్లేర్ చేశారని అడిగిన ప్రశ్నకు.. భారత జట్టును మైదానంలో చాలాసేపు ఉండేలా చేసి, చివరికి వారిని తమ ముందు సాష్టాంగం పడేలా చేయాలనుకున్నామని సౌత్ ఆఫ్రికా కోచ్ బదులిచ్చాడు. చివరి రోజు చివరి నిమిషం వరకు టీమిండియా ప్లేయర్స్ పోరాడుతూనే ఉండాలని.. ఆ తర్వాత తాము పై చేయి సాధించాలని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగింది. అయితే తొలి వన్డేలో భారత జట్టు గెలుపొందిన అనంతరం ఆటగాళ్లంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో.. విరాట్ కోహ్లీ.. సౌత్ ఆఫ్రికా హెడ్ కోచ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు.

Also Read: KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 99% సక్సెస్ రేటు.. గిల్ దండగే, తొల‌గించాల‌ని డిమాండ్స్ !

సౌత్ ఆఫ్రికా కోచ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే విరాట్ కోహ్లీ ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. దీంతో సౌత్ ఆఫ్రికా అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు. కోహ్లీని గొప్ప ఆటగాడని చెబుతుంటారని.. కానీ మ్యాచ్ సమయంలో సౌత్ ఆఫ్రికా ప్లేయర్లను తిట్టడం, మ్యాచ్ అనంతరం కోచ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు భారత అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీకి అండగా ఉంటున్నారు. సెంచరీ చేసి భారత జట్టును గెలిచేలా చేయడంతో.. అది తట్టుకోలేక ఇలా కొంతమంది సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారానికి దిగుతున్నారని మండిపడుతున్నారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×