E-Paper
Advertisement

The Paradise : ‘ప్యారడైజ్ ‘ నుంచి పోస్టర్ వచ్చేసింది..రక్తం కారే గొడ్డలితో సంపూ..

The Paradise : ‘ప్యారడైజ్ ‘ నుంచి పోస్టర్ వచ్చేసింది..రక్తం కారే గొడ్డలితో సంపూ..
Advertisement

The Paradise : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ హిట్ 3… బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.. గత కొన్నేళ్లగా హీరో నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. దసరా బ్లాక్‌బస్టర్‌ హిట్ తర్వాత నాని మరోసారి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో జతకట్టారు.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ది ప్యారడైజ్.. ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి..  తాజాగా ఈ చిత్రం నుంచి సంపూర్ణేష్ బాబు పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది…

ది ప్యారడైజ్ నుంచి సంపూ పోస్టర్ రిలీజ్…

నాని హీరో నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్ మూవీ నుంచి తాజాగా నటుడు సంపూర్ణేష్ బాబు పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్లో ఆయన భుజంపై రక్తం తో తడిసిన గొడ్డలిని భుజం పై వేసుకొని మరో చేతితో బీడీ పెట్టుకుని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఊరమాస్ లుక్ లో ఆయన కనిపించడంతో పోస్టర్ ట్రెండ్ అవుతుంది.. గతంలో కామెడీ పాత్రల్లో నటించిన ఈయన ఈ మూవీలో ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని పోస్టర్ని చూస్తే అర్థమవుతుంది.. ప్రస్తుతం ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. మరి ఈ సినిమా సంపూర్ణేష్ బాబుకు ఎలాంటి రికార్డులను తెచ్చిపెడుతుందో చూడాలి..

Advertisement

‘ది ప్యారడైజ్’ పై పెరుగుతున్న అంచనాలు.. 

గతంలో హీరో నాని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొనే లవ్ ఎంటర్టైనర్ స్టోరీలతో సినిమాలు ఎక్కువగా చేసేవాడు. దసరా మూవీతో యాక్షన్ హీరో అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హిట్ 3 మూవీతో ప్రేక్షకులను అలరించిన నాని ‘ప్యారడైజ్ సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన నాని ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేశాయి. కాకుల కథతో వస్తున్నా ఈ మూవీని ఎప్పుడుడెప్పుడు చూస్తామని నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇక అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇంకా భారీగా పెంచేలా డైరెక్టర్ రూపొందిస్తున్నారు. డైరెక్టర్ పై నమ్మకంతో భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.. మార్చిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటున్నారు చూడాలి… ఈ సినిమా తర్వాత నాని మరో రెండు యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈయన నిర్మాణ సంస్థపై ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×