E-Paper
Advertisement

Harish Rao: ఇంటిని తాకట్టు పెట్టినట్టే.. కాళేశ్వరం సొమ్ము కూడా తిరిగి ఇచ్చేయండి.. హరీష్ రావుపై నెటిజన్లు కామెంట్ల వర్షం

Harish Rao: ఇంటిని తాకట్టు పెట్టినట్టే.. కాళేశ్వరం సొమ్ము కూడా తిరిగి ఇచ్చేయండి.. హరీష్ రావుపై నెటిజన్లు కామెంట్ల వర్షం
Advertisement

Harish Rao: కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో దోచుకున్న అవినీతి సొమ్మును మాజీ మంత్రి హరీష్ రావు తిరిగే ఇచ్చేయాల‌న్న డిమాండ్ సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హ‌రీష్ రావు త‌న సొంత ఇంటిని తాక‌ట్టు పెట్టి సిద్దిపేట‌కు చెందిన విద్యార్థిని పీజీ మెడిక‌ల్ విద్య కోసం ఆర్థిక సాయం చేయ‌డం ఒక పొలిటిక‌ల్ స్టంట్‌గా నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ నేత‌ల వ‌ద్ద డ‌బ్బులు లేవంటే ఎవ‌రూ న‌మ్మ‌బోర‌ని, ఇళ్లు తాక‌ట్టు అంతా కూడా హ‌రీష్ రావు అడుతున్న ప‌బ్లిసిటీ స్టంట్ అని నేటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో దోచుకున్న సొమ్మును హ‌రీష్ రావు తిరిగే ఇచ్చేస్తే రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా చ‌దువుల కోసం లోన్లు తీసుకోవాల్సి అవ‌స‌రం రాద‌నే అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియాలో వ్య‌క్తం చేస్తున్నారు.

వేల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన వ్య‌క్తి రూ. 20 ల‌క్ష‌ల కోసం ఇల్లు తాకట్టు పేరుతో సానుభూతి పొందాలని చూడటం హాస్యాస్పదంగా ఉంద‌ని ప‌లువురు ఓయూ విద్యార్థులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. కాళ్వేరం నిర్మాణం పూర్తి అవినీతిమ‌యం చేశార‌ని, అందుకే ఆది కూలిపోయింద‌ని చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ప‌న్నుల‌తో క‌ట్టిన ప్రాజెక్టు నిర్మాణంలో కోట్లాది రూపాయాల అవినీతి జ‌రిగింది కాబ‌ట్టే నాసిరకం ప‌నులు చేశార‌ని, అందుకే ఆ ప్రాజెక్టు కూలిపోయి నిరూప‌యోగంగా మారింద‌ని గుర్తు చేస్తున్నారు.

Advertisement

కాళేశ్వ‌రం బ్యారేజీల నిర్మాణాల్లో మొద‌టి అంచ‌నాల‌ను స‌వ‌రించి రెండోసారి రూపొందించిన అంచాన‌ల‌తో నిధుల దోపిడీ జ‌రిగింద‌నే విష‌యాన్ని జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ వెల్ల‌డించిన విష‌యాన్ని నేజిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. స‌వ‌రించిన అంచ‌నాల ద్వారా నిర్మాణ సంస్థ‌ల‌కు ల‌బ్ధి క‌లిగించి, వారి నుంచి బీఆర్ఎస్ నేత‌లు త‌మ జేబులు నింపుకున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ నిర్ణ‌యాల్లో మాజీ సీఎం కేసీఆర్ ఏక‌పక్షంగా తీసుకున్న నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని, నిర్మాణ‌లు మొద‌లుకొని ఈ ప్రాజెక్టులు దెబ్బ‌తినే వ‌ర‌కు అనేక ఉల్లంఘ‌న‌లు, అర్థిక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని క‌మిష‌న్ స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని నేటిజ‌న్లు హ‌రీష్ రావుకు గుర్తు చేస్తున్నారు.

‘వేల కోట్ల కాళేశ్వరం స్కామ్‌లో వాటాలు అందుకున్న వ్యక్తికి, ఇప్పుడు 20 లక్షల రూపాయల కోసం ఇల్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ దోచుకున్న సొమ్మును బయటకు తీస్తే తెలంగాణలో వేలాది మంది పేద విద్యార్థులను డాక్టర్లుగా మార్చవచ్చు కదా!’ అని ఒక నెటిజన్ హ‌రీష్ రావుకు సూచించారు. ఇళ్లు తాక‌ట్టు వ్య‌వ‌హారం అంతా కాళేశ్వ‌రం క‌వ‌ర్ అప్ కోస‌మే అని మ‌రో నేటిజ‌న్ కామెంచ్ చేశారు. గ‌తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులను నిలిపివేసి, వేలాది మంది విద్యార్థుల చదువులను ఆటంకపరిచిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిద‌ని, ఇప్పుడు ఒక విద్యార్థిని కోసం ఇల్లు తాకట్టు పెట్టినట్లు నటించడం విడ్డూరంగా ఉందని మ‌రొకు కామెంట్ చేశారు.

Advertisement

ALSO READ: fake rs 500 Notes: నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 417 నోట్లు

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×