E-Paper
Advertisement

Naveen Polishetty : పాట రెడీగా ఉందా.. స్టార్ హీరోలు… నిర్మాతలపై నవీన్ సెటైర్లు

Naveen Polishetty : పాట రెడీగా ఉందా.. స్టార్ హీరోలు… నిర్మాతలపై నవీన్ సెటైర్లు
Advertisement

Naveen Polishetty : ఈ రోజుల్లో ఏ తెలుగు సినిమా దర్శక నిర్మాతలు కూడా చెప్పిన టైంకి పాటగాని అప్డేట్ గాని ఇవ్వరు. ఒక టైం చెప్తారు ఆ టైం తర్వాత కొన్ని కారణాల వలన అంటూ మరో టైం మారుస్తారు. ఆ టైం కైనా కరెక్ట్ గా ఇస్తారు అనుకుంటే అప్పుడు కూడా ఒక రెండు మూడు నిమిషాలు లేట్ అవుతూనే ఉంటుంది. అయితే ఒక పాట ఆ టైం కి రాకపోతే ఎందుకు అప్డేట్ ఇవ్వడం అనేది చాలామంది ప్రేక్షకులకి ఉన్న డౌట్.

ఇలా జరగడం అనేది కేవలం ఒక సినిమాకి సంబంధించి కాదు చాలా సినిమాలకు సంబంధించి ఇలా పాటలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే రాజా సాబ్ సినిమా ఈవెంట్ విషయంలో ఎంత గందరగోళం జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు నిమిషాల్లో పాట వస్తుంది అంటూ, ఐదు నిమిషాల్లో వస్తుంది అంటూ, దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్ కే ఎన్, యాంకర్ తో సహా అందరూ కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అనుకున్న టైం కంటే కూడా రెండు గంటలు లేటుగా ఆ పాట వచ్చింది.

Advertisement

మహేష్ బాబు వారణాసి ఈవెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే అది భారీ బడ్జెట్ సినిమా, అలానే భారీ తారాగణం ఉన్న సినిమా , అలానే ఒక వరల్డ్ పరిచయం చేయాలి కాబట్టి అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ జరిగింది. ఇక నిన్న రిలీజ్ కావలసిన టైంకి ఛాంపియన్ సినిమా పాట కూడా విడుదల కాలేదు. వీటన్నిటి పైన నవీన్ పోలిశెట్టి ఈరోజు స్టేజ్ పైన మాట్లాడారు.

నిర్మాతలపై సెటైర్లు

నవీన్ పోలిశెట్టి భీమవరంలోని ఒక కాలేజ్ ఈవెంట్ కు భీమవరం బల్మ అనే సాంగ్ లాంచ్ కు వెళ్లారు. తను నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా నుంచి విడుదలవుతున్న ఫస్ట్ సాంగ్ అది. ఆ సాంగ్ 6 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ పాట కూడా చెప్పిన టైంకి ఆన్లైన్లో రాలేదు. కొంత లేట్ అయింది.

Advertisement

గతంలో చాలా సినిమాలకు సంబంధించి ఇలాంటివి జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా బహుశా నవీన్ పోలిశెట్టి దృష్టిలో పెట్టుకున్నట్లు ఉన్నారు. అందుకనే ఈరోజు జరిగిన ఈవెంట్లో పాట ప్లే చేసే ముందు. మన పాట రెడీగా ఉందా. ఇప్పుడు కౌంటర్ డౌన్ చేస్తే మన సినిమా పాటే వస్తుందా లేకపోతే వేరే సినిమా పాట వస్తుందా. అంటూ పదేపదే అడిగారు.

రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నవీన్ పోలిశెట్టికి బాగా రిజిస్టర్ అయినట్లు ఉన్నాయి. గతంలో కూడా రాదే శ్యామ్ ఈవెంట్ అప్పుడు నవీన్ మాట్లాడుతూ అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదు మీ ఆఫీస్ లో రూటర్ ప్రాబ్లమా అంటూ కామెడీ చేశాడు. మొత్తానికి ఇప్పుడు కూడా కామెడీ చేస్తూ చాలామందికి ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేశాడు.

Also Read : Anaganaga Oka Raju: ఎద్దులబండి పై ఈవెంట్ కు వచ్చిన నవీన్, అంతా రాజమౌళి ప్రభావం

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×