E-Paper
Advertisement

iPhone 17 Price Hike: త్వరలో ఐఫోన్ 17 ధర పెంపు, కారణం ఏంటంటే?

iPhone 17 Price Hike: త్వరలో ఐఫోన్ 17 ధర పెంపు, కారణం ఏంటంటే?
Advertisement

టెక్ దిగ్గజం ఆపిల్  సెప్టెంబర్ లో మూడు ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ ను వినియోగదారులకు పరిచయం చేసింది. ఇవి గత ఏడాది విడుదలైన ఐఫోన్ల కంటే లేటెస్ట్ అప్ గ్రేడ్స్ తో అందుబాటులోకి వచ్చాయి. అయితే, కంపెనీ రీసెంట్ గా ఐఫోన్ 16కు సంబంధించి గతంలో 128GB వేరియంట్‌ ను బేస్ వేరియెంట్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ, తాజాగా దాన్ని తొలగించింది. రూ. 3,000 ధర పెంచి 256GBని బేస్ వేరియంట్‌గా మార్చింది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ కంపెనీ ఇండియాలో ఐఫోన్ 17 వేరియంట్ల ధరను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి టిప్‌ స్టర్ యోగేష్ బ్రార్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ కు భారీగా డిమాండ్ ఉందని, బ్రాండ్ స్టాక్ తక్కువగా ఉందని, అందుకే ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 17 ధర పెంపు

టిప్‌ స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. ఐఫోన్ 17 ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. బేస్ 256GB,  512GB స్టోరేజ్ వేరియంట్లకు సుమారు రూ.7,000 వరకు ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, రెండు వేరియంట్ల ధర రూ. 89,900, రూ. 1,09,900 అవుతుంది. అదే జరిగితే, వెనిల్లా ట్రిమ్, ఐఫోన్ ఎయిర్ మధ్య ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్ దాదాపు రూ. 1,12,900కి అమ్ముడవుతోంది.

Advertisement

భారీగా పెరుగుతున్న సెల్ ఫోన్ ధరలు

హార్డ్‌ వేర్ కాంపోనెంట్స్ ధరల పెరుగుదల కారణంగా దాదాపు అన్ని స్మార్ట్‌ ఫోన్ తయారీదారులు, తమ హ్యాండ్ సెట్స్  ధరలను పెంచుతున్నాయి. iQOO 15 దాని ముందున్న దానికంటే రూ. 18,000 పెరుగుదలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. Realme GT 8 Pro రూ. 13,000 పెంచింది. అదే సమయంలో Find X9, OnePlus 15 గత సంవత్సరం ధరలతో పోలిస్తే రూ. 5,000, రూ. 3,000 పెరిగాయి. అయితే, ఆపిల్ ఇప్పటికీ కస్టమర్లకు పెరిగిన ధరను ఆదా చేయడంలో సహాయపడటానికి బ్యాంక్ డిస్కౌంట్లను అందించవచ్చని టిప్‌ స్టర్ చెప్పారు. ఆపిల్ ప్రస్తుతం ఐఫోన్ 17 ధరల పెరుగుదలను ధృవీకరించలేదని, త్వరలో వివరాల కోసం వేచి ఉండాలన్నారు. అటు టిప్‌ స్టర్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధరలను ప్రస్తావించలేదు. అయితే, త్వరలో ఆపిల్ ధరల పెంపుకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×