E-Paper
Advertisement

Netflix on NBK : బాలయ్య డై హార్డ్ ఫ్యాన్‌గా నెట్‌ఫ్లిక్స్… జై బాలయ్య అంటూ!

Netflix on NBK : బాలయ్య డై హార్డ్ ఫ్యాన్‌గా నెట్‌ఫ్లిక్స్… జై బాలయ్య అంటూ!
Advertisement

Netflix on NBK : తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మారుమోగే జై బాలయ్య అనే పదం.. ఇప్పుడు Netflix India South అధికారిక సోషల్ మీడియా పేజీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో నెట్ ఫ్లిక్స్.. కి ఎంతటి పేరు ఉందో అందరికీ తెలిసిందే. అన్ని భాషల వారికి.. ఎంతో ఇష్టమైన అంతర్జాతీయ..ఓటిటి ప్లాట్ ఫామ్ గా.. పేరు తెచ్చుకుంది.

అలాంటి నెట్ ఫ్లిక్స్ కూడా ఇప్పుడు బాలయ్యకి ఫ్యాన్ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్..Jai Balayya.. అని తమ ట్విట్టర్ పేజీలో.. ఏకంగా బయోలో రాయడం చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సాధారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమాల ప్రమోషన్ వరకే పరిమితమవుతాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈసారి నేరుగా బాలయ్య అభిమానిగా మారినట్టే కనిపిస్తోంది.

Advertisement

నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో ఆయన సినిమా రిలీజ్ అయితే పండగ వాతావరణం కనిపిస్తుంది. అదే క్రేజ్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కూడా కనిపిస్తోంది. అఖండ 2.. సినిమా థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న తరువాత.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా జనవరి 9, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ తమ ప్రొఫైల్‌లో అఖండ సినిమాకు సంబంధించిన బ్యానర్‌ను పెట్టడం..అలాగే “జై బాలయ్య” అని రాయడం అభిమానులను మరింత ఉత్సాహానికి గురి చేసింది. సాధారణంగా స్టార్ హీరోలకు ఫ్యాన్ పేజీలు ఇలాంటివి చేస్తాయి. కానీ ఒక అంతర్జాతీయ ఓటీటీ సంస్థ ఇలా స్పందించడం అంటే బాలయ్య క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

అఖండ 2: థాండవం సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అఘోర పాత్రలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, బాలయ్య నటనకు మాత్రం అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో, థియేటర్‌కు వెళ్లలేని వారు, మళ్లీ చూడాలనుకునే అభిమానులు ఆనందంగా ఇంట్లోనే సినిమా చూసే అవకాశం వచ్చింది. అందుకే నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

మొత్తం పైన..జై బాలయ్య అనే ఒక చిన్న మాటతోనే నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్, నందమూరి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇది బాలయ్య క్రేజ్‌కు మరో నిదర్శనం అని చెప్పొచ్చు.

ALSO READ: Tollywood Sequels: కంగువా నుంచి రాజా సాబ్ వరకు.. ఆగిపోయిన స్టార్ హీరోల సీక్వెల్స్ ఇవే..!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×