Actor Kamal Roy Death: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు పలు కారణాల వల్ల మరణిస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది. తాజాగా మరొక నటుడు మరణ వార్త ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిత్రపరిశ్రమలో నటుడుగా కొనసాగుతున్న కమల్ రాయ్ (54) (Kamal Roy)గుండెపోటు కారణంగా మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు నివాళులు అర్పిస్తున్నారు. కమల్ రాయ్ పలు సినిమాలలో నటుడిగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు.
ఇక ఈయన ప్రముఖ నటి ఊర్వశి(Urvashi) సోదరుడు అనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఊర్వశి, కళారంజని, దివంగత నటి కల్పనకు ఈయన సోదరుడు కావటం విశేషం. సినీ కుటుంబ నేపథ్యం నుంచి అడుగుపెట్టిన కమల్ కు 54 సంవత్సరాల వయసులో ఈయనకు గుండెపోటు రావడంతో చెన్నైలో మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఈయన మరణం పై నిర్మాత వినయన్ సంతాపం తెలిపారు. ఫేస్‌బుక్ లో కమల్ మృతి పై స్పందిస్తూ తాను దర్శకత్వం వహించిన కళ్యాణ సౌగంధికం చిత్రంలో మిస్టర్ రాయ్ విలన్ పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.
ఇక కమల్ తన సోదరి ఊర్వశి మోహన్ లాల్ హీరో హీరోయిన్లుగా నటించిన “యువజనోల్సవం” అనే సినిమాలో విలన్ గా నటించారు. ఈయన సినీ కెరియర్లో కల్యాణ సౌగంధికం సాయిజ్యం,కొల్లిల్లాక్కం వంటి సినిమాల ద్వారా నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను పొందారు. కేవలం వెండితెర పై మాత్రమే కాకుండా ఈయన బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉన్న కమల్ ఉన్నఫలంగా మరణించారనే వార్త జీర్ణించుకోలేనిదని చెప్పాలి. సోదరుడు మరణంతో ఊర్వశి ఇంట్లో తీవ్రవిషాదం నెలకొంది.
కవితా రంజనిగా..
ఇకనటి ఊర్వశి విషయానికి వస్తే.. కవిత రంజనిగా ఉన్న ఈమె ఊర్వశిగా ఇండస్ట్రీకి పరిచయమై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈమె తెలుగు సినిమాల కంటే కూడా ఎక్కువగా తమిళ మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇక తెలుగులో ఊర్వశి యమకింకరుడు, సందడే సందడి, భలే తమ్ముడు, ఆడవాళ్లకు మాత్రమే వంటి పలు సినిమాలలో నటించారు. ఇద్దరు సోదరీమణులు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా స్థిరపడి మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: Tharun Bhascker mother:భార్యకు భయపడకురా… ఈషా రెబ్బ విషయంలో తరుణ్ భాస్కర్‌కు తల్లి షాకింగ్ సజెషన్