Netflix: ఓటీటీ రేంజ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది నెట్ ఫ్లిక్స్. మొదటి నుంచి కూడా నెట్ ఫ్లిక్స్ లో అడల్ట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ అని అందరికీ తెల్సిందే. తెలుగువారు అయితే నెట్ ఫ్లిక్స్ లో సినిమాలను కుటుంబసమేతంగా చూడడానికి కూడా భయపడుతున్నారు.
థియేటర్ కు వెళ్లకుండా.. కుటుంబంతో సహా ఇంట్లో కూర్చొని చూడాలని అందరూ ఓటీటీల బాట పట్టారు. కానీ, అందులోనే అడల్ట్ కంటెంట్ ఉండడంతో చూడలేకపోతున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో అడల్ట్ సీన్ వస్తే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. ఎప్పటినుంచో నెట్ ఫ్లిక్స్ లో ఇలాంటి అడల్ట్ సినిమాలు, సిరీస్ లు తీయడం తగ్గించాలని ప్రేక్షకులు చాలాసార్లు చెప్పుకొచ్చారు. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం ఆ మాటను పట్టించుకున్నదే లేదు.
అయితే గత రెండు రోజులుగా నెట్ ఫ్లిక్స్ లో ఒక కొత్త ఫీచర్ వచ్చిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అదేంటంటే.. నెట్ ఫ్లిక్స్ కొత్తగా అడల్ట్ సీన్ స్కిప్ బటన్ ని తీసుకొచ్చారట. అంటే.. ఒక సినిమా చూస్తున్నప్పుడు అడల్ట్ సీన్స్ వచ్చినప్పుడు కింద ప్లే, అడల్ట్ సీన్ స్కిప్ అనే బటన్స్ కనిపిస్తాయి. ఆ సీన్ ను చూడాలనుకుంటే ప్లే అని.. చూడకూడదు అనుకుంటే స్కిప్ బటన్ నొక్కితే ఆ సీన్ వరకు కట్ అయ్యి.. మిగతా సినిమా వస్తుంది.
ఈ ఫీచర్ బాగుందని, నెట్ ఫ్లిక్స్ మంచి నిర్ణయం తీసుకుందని స్క్రీన్ షాట్స్ తీసి మరీ చెప్పుకొచ్చారు. అయితే ఇది నిజమా.. కాదా అని చూస్తే అదంతా ఫేక్ అని తెలిసింది. నెట్ ఫ్లిక్స్ అలాంటి ఫీచర్ ఏది తీసుకురాలేదు అని తెలుస్తోంది. కొందరు ఈ స్క్రీన్ షాట్స్ తీసి చూపించడంతో నిజమేనేమో అనుకున్నారు. కానీ, నెట్ ఫ్లిక్స్ కి మాత్రం ఇది ఏది కూడా తెలియదు అని సమాచారం. కొందరు కావాలనే ఇలాంటివి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇకమీదట నెట్ ఫ్లిక్స్ కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. సినిమాలను ఎలా పడితే అలా కొనడం అనేది మానేసింది. హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ను ఓపెన్ చేసింది. హీరోలు, బ్యానర్లు, డైరెక్టర్స్ కాంబోలను చూసి ఇష్టం వచ్చిన రేట్లకు కొనడం అనేది ఇకనుంచి ఉండదట. ఈటీవీ విన్ లా సొంతంగా తమ బిజినెస్ ను పెంచుకోవాలని చూస్తున్నారట. అంటే కొత్త సినిమాలను నెట్ ఫ్లిక్స్ నిర్మించనుందట. మరి ముందు ముందు నెట్ ఫ్లిక్స్ ఏ రేంజ్ లో ప్లానింగ్ చేస్తుందో చూడాలి.