E-Paper
Advertisement

Nidhhi Agerwal: ‘మళ్లీ దొరికిపోయా’.. తప్పు ఒప్పుకున్న నిధి అగర్వాల్

Nidhhi Agerwal: ‘మళ్లీ దొరికిపోయా’.. తప్పు ఒప్పుకున్న నిధి అగర్వాల్
Advertisement

Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల తార నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ మారుతీ(Maruthi  ) దర్శకత్వంలో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ వేదికగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇందులో చీరకట్టులో అందాలు ఆరబోస్తూ అందరినీ మెస్మరైజ్ చేసింది నిధి అగర్వాల్. అంతేకాదు నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి? ఏ స్థాయిలో ఉండాలి? అనే ప్రశ్నలతో ప్లకార్డులు కూడా పట్టుకుని తిరిగారు అభిమానులు.

తప్పు ఒప్పుకున్న నిధి అగర్వాల్..

అలాంటి ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. లవ్ సింబల్ ని తన చేతులతో చూపిస్తున్న ఒక ఫోటోని షేర్ చేసింది. అందులో ఆమె అరచేతిలో ఏదో రాసి ఉంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఒక ట్విట్టర్ యూజర్ దానిని షేర్ చేస్తూ.. “మీ చేతిలో రాసి ఉంది ఏమిటది? క్యూరియాసిటీతో అడగకుండా ఆగలేక పోతున్నాను.. దీనిని చూస్తుంటే చిన్నప్పుడు నేను అరచేతిలో రాసుకున్న విషయాలు గుర్తుకొస్తున్నాయి ” అంటూ ఒక ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. అయితే దీనిని రీ ట్వీట్ చేస్తూ నిధి అగర్వాల్ “అయ్యో.. మళ్లీ దొరికిపోయానే ఊప్స్ “అంటూ కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మొత్తానికైతే మళ్లీ దొరికిపోయాను అంటూ తప్పు ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తన అరచేతిలో ఏం రాసుకుంది అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.

Advertisement

ALSO READ:Ritika Nayak: లక్కీ ఛాన్స్ కొట్టేసిన మిరాయ్ బ్యూటీ.. 2026 ఫుల్ బిజీ!

నిధి అగర్వాల్ సినిమాలు..

నిధి అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. ది రాజా సాబ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యాక తన తదుపరి ప్రాజెక్టుల గురించి వెల్లడిస్తాను అని కూడా చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. ప్రస్తుతం తెలుగులో మూడు ప్రాజెక్టులు చేస్తున్నట్లు చెప్పిన ఈమె అలాగే తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కానీ దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది నిధి అగర్వాల్ . అలాగే రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రంపై పలు ఆసక్తికర కామెంట్లు చేసిన నిధి అగర్వాల్.. ప్రభాస్ గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేసింది . ముఖ్యంగా తన కెరియర్లో ప్రభాస్ లాంటి మంచి మనసున్న వ్యక్తిని చూడలేదని, ఆయన ఇచ్చే అతిథ్యానికి తాను ఫిదా అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రభాస్ లాంటి మంచి వ్యక్తులతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని కూడా తెలిపింది నిధి అగర్వాల్.

Advertisement

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×