E-Paper
Advertisement

Nidhi Agarwal: 14 ఏళ్లకే స్టార్ట్ చేసేసింది… పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కి ఇదేం అలవాటు?

Nidhi Agarwal: 14 ఏళ్లకే స్టార్ట్ చేసేసింది… పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కి ఇదేం అలవాటు?

Nidhi Agarwal: ఒకప్పుడు కేవలం మద్యపానం అంటే మగవాళ్ళు మాత్రమే చేస్తారని అనుకునే వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ట్రెండ్ మారింది. ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మద్యాన్ని సేవించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. పార్టీ కల్చర్ పెరిగిపోవడంతో ఆడవాళ్లు కూడా మందు తాగితే వచ్చే కిక్కే వేరంటున్నారు.. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు పబ్ లకు వెళ్లడం మందుకొట్టడం కామన్ అయిపోయింది.. సెలబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరోయిన్లు ఎక్కువగా వైన్ ను తీసుకుంటుటారు.. అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం వైన్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనే సందేహం కూడా కలుగుతుంది కదూ.. అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె తన కోరికను బయటపెట్టేసింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అసలు మ్యాటర్ లోకి వెళితే..

14 ఏళ్లకే మందుకొట్టిన నిధి.. 

మద్యం సేవించాలంటే ఒక వయసు ఉంటుంది.. కానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ మాత్రం 14 ఏళ్లకే ఆ పని స్టార్ట్ చేసిందట.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి తన సినిమాల గురించి మాట్లాడుతూనే తన అలవాట్లు గురించి కూడా బయట పెట్టింది. ఇందులో 14 ఏళ్లకే మందు కొట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఆ వయసులో ఫ్రెండ్స్ తో కలిసి తాగడం చాలా సరదాగా అనిపించేది. అయితే ఏళ్లు గడిచే కొద్దీ నాకు మందు మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ వచ్చింది. అందులోనూ ఆ మందు నా బాడీకి సెట్ అవ్వలేదు. దాంతో మెల్లగా మందు తాగే అలవాటుని మానుతూ వచ్చాను. ప్రస్తుతం ఆ వాసన కూడా నాకు పడడం లేదు అంటూ నిధి పాప అంటుంది. ఆరేళ్లు కిందటే మందు తాగడం పూర్తిగా మానేసిందట.. ఈ విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నిధి అలవాటు తెలిసిపోయింది.. ఇది విన్న నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తన అలవాటు బయటపెట్టి మరోసారి నిధి పాప వార్తల్లో నిలిచింది.

పార్టీల్లో నిధి ఇప్పుడేం చేస్తుందంటే..? 

సినిమా హీరోయిన్లు పార్టీలకు వెళ్లడం సర్వసాధారణం. పార్టీలంటే కచ్చితంగా మద్యపానం కూడా ఉంటుంది. అయితే నిధి అగర్వాల్ మాత్రం ఇప్పుడు పార్టీలకు దూరంగా ఉంటున్న విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పింది. ఒకవేళ ముఖ్యమైన పార్టీలు అయితే అక్కడికి వెళ్లినా కానీ తాను మద్యం సేవించదట. మరి ఏం తీసుకుంటుంది అనే సందేహం వస్తుంది కదూ.. పార్టీలకు వెళ్లిన నిధి అక్కడ గ్రీన్ టీ తాగుతుందట. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఆమె చెప్పిన అక్షర సత్యం ఇదే.. పార్టీలో మందు కొట్టకుండా ఉంటేనే బాగా ఎంజాయ్ చేస్తారని నిధి అంటుంది..

Also Read:ఎన్టీఆర్ – నీల్ చిత్రానికి మరోసారి బ్రేక్.. ఇప్పటిలో సినిమా లేనట్లే..?

ఇక నిధి అగర్వాల్ సినిమాల విషయానికొస్తే.. ఈమధ్య ఈ అమ్మడు ఏ సినిమా చేసినా కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోవడం లేదు.. రీసెంట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీలో నటించింది.. అది పెద్దగా హిట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆమె ఓ రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే తన సినిమాలు గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×