E-Paper
Advertisement

Ratha Saptami 2026: ఈ ఏడాది రథ సప్తమి ఎప్పుడు ? పూజా విధానం, పూర్తి వివరాలు

Ratha Saptami 2026: ఈ ఏడాది రథ సప్తమి ఎప్పుడు ? పూజా విధానం, పూర్తి వివరాలు

Ratha Saptami 2026: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథిని ‘రథ సప్తమి’గా జరుపుకుంటారు. దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. సృష్టి ప్రారంభంలో.. సూర్య భగవానుడి మొదటి కిరణాలు ఈ రోజున భూమిపైకి ప్రసరించాయని పురాణాలు చెబుతున్నాయి. 2026వ సంవత్సరంలో రథ సప్తమి మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ‘ఆదివారం’ నాడు రావడం విశేషం.

రథ సప్తమి 2026 తేదీ, శుభ ముహూర్తం:

క్యాలెండర్ ప్రకారం.. 2026లో సప్తమి తిథి వివరాలు..

సప్తమి తిథి ప్రారంభం: జనవరి 24 (శనివారం) అర్ధరాత్రి 12:40 గంటలకు.

సప్తమి తిథి ముగింపు: జనవరి 25 (ఆదివారం) రాత్రి 11:11 గంటలకు.

ముఖ్యమైన తేదీ: ఉదయ తిథి ప్రాధాన్యత ప్రకారం.. జనవరి 25 ఆదివారం నాడు రథ సప్తమి వేడుకలు నిర్వహించుకోవాలి.

ముఖ్యమైన సమయాలు:

అరుణోదయ స్నాన సమయం: ఉదయం 05:32 నుంచి 07:12 వరకు పుణ్య స్నానాలు చేయవచ్చు.

పూజ, దానాలకు శుభ సమయం: ఉదయం 11:13 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు దానాలు, పూజలు చేయడానికి మంచి సమయం.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

రథ సప్తమిని మాఘి సప్తమి, మహతి సప్తమి లేదా పుత్ర సప్తమి అని రకరకాలుగా పిలుస్తారు. సూర్య భగవానుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజు ఇది. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడు జన్మల పాపాలు నశిస్తాయని అంతే కాకుండా.. చర్మ వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని పద్మ , భవిష్య పురాణాలు పేర్కొంటున్నాయి.

పూజా విధానం:
రథ సప్తమి నాడు స్నానం, సూర్య నమస్కారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

పవిత్ర స్నానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. తలపై ఏడు జిల్లేడు ఆకుల, ఏడు రేగు ఆకులు పెట్టుకుని స్నానం చేయడం ఈ పండగ ప్రత్యేకత.

దీపారాధన: ఆకులపై నువ్వుల నూనెతో దీపం వెలిగించి, దానిని తలపై ఉంచుకుని సూర్యుడిని ధ్యానించాలి. అనంతరం ఆ దీపాన్ని ప్రవహించే నీటిలో వదలాలి.

సూర్య అర్ఘ్యం: రాగి పాత్రలో నీరు తీసుకుని.. అందులో అక్షతలు, ఎర్రటి పువ్వులు, చందనం కలిపి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.

మంత్రం: “సప్తసప్తివాహ ప్రీత్ సప్తలోకప్రదీపాన్, సప్తమ్య సహితో దేవ గృహాణార్ఘ్య దివాకర్”

Also Read: శివలింగం, జ్యోతిర్లింగం మధ్య తేడా ఏంటి ?

ముఖ్యమైన మంత్రాలు:

స్నానం చేసేటప్పుడు, పూజ సమయంలో ఈ కింది మంత్రాలను జపించడం వల్ల శుభం కలుగుతుంది.

స్నాన మంత్రం: “యద్ యజ్జన్మకృతం పాపం యచ్ జన్మాంతరార్జితం | తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ||”

అర్ఘ్య మంత్రం: “ఓం ఘృణి సూర్యాయ నమః” లేదా “ఓం నమో నారాయణాయ” అని జపిస్తూ పదహారు ఉపచారాలతో పూజ చేయాలి.

రథ సప్తమి పర్వదినం కేవలం ఒక పండగ మాత్రమే కాదు. ప్రకృతితో మమేకమై ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున చేసే దానధర్మాలు, ముఖ్యంగా బ్రాహ్మణులకు లేదా పేదలకు చేసే సహాయం అనంతమైన ఫలితాలను ఇస్తుంది.  జనవరి 25న ఈ పవిత్ర నియమాలను పాటించి సూర్య భగవానుడి కృపకు పాత్రులు అవ్వండి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×