E-Paper
Advertisement

Niharika Konidela: విడాకుల తర్వాత జీవితం పై నిహారిక కామెంట్స్.. ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారా?

Niharika Konidela: విడాకుల తర్వాత జీవితం పై నిహారిక కామెంట్స్.. ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారా?
Advertisement

Niharika Konidela: నిహారిక ప్రస్తుతం రాకాసా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మూడో తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా సినిమాలకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా తన విడాకులు గురించి కూడా ఇప్పటికీ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. నిహారిక విడాకులు తీసుకొని దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.

విడాకుల గురించి నాన్నకే చెప్పాను..

ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విడాకుల గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో నిహారిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిహారిక సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని కుటుంబానికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయిని ఈమె పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఏడాది పాటు ఎంతో సంతోషంగా గడిపిన వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే విడాకులు తీసుకున్నారు.. అయితే ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే మీరు ముందుగా ఎవరితో చెప్పారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నలకు నిహారిక సమాధానం చెబుతూ తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుగా నాన్నకు చెప్పానని తెలిపారు.

విడిపోవాలని ఎవరు పెళ్లి చేసుకోరు..

Advertisement

నాన్నకు ఈ విషయం చెప్పగానే సైలెంట్ గా విన్నారు వాళ్లు కూడా పెళ్లి తర్వాత నన్ను చూశారు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవనుకున్నప్పుడు ఎక్కడా ఉండాల్సిన అవసరం లేదు అంటూ నాన్న చెప్పారు. ఎవరు కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు అయితే మా మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివని, అలాంటప్పుడు ఇద్దరం కలిసి విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం మంచిదనిపించిందని నిహారిక తెలిపారు. ఒకటినొకరు బాగా కొట్టుకొని విడిపోతే అది తొందరగా మరచిపోతారు కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టమని నిహారిక తెలిపారు.

ఫ్రెండ్ గా కాంటాక్ట్ లో ఉన్నారా?

Advertisement

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఒక కామెంట్ చేస్తారు విడాకులు తీసుకొని విడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ మాట్లాడుతుంటారు. అయితే గతంలో ఎవరైతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని ఉంటారో అలాంటి వారి మధ్య గొడవలు వచ్చినప్పటికీ వాళ్ళు విడిపోవాలి అనుకున్నప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్తే మా నాన్న పోషించగలరా అన్న భయంతో అలాగే కొనసాగుతున్నారు కానీ విడాకులు అనేది ఇప్పుడు తీసుకుంటున్నది కాదని, ఎప్పటినుంచో ఉందని తెలిపారు. అప్పట్లో ఒక మహిళ తన అవసరాల కోసం కూడా అబ్బాయిపై ఆధారపడేది కానీ ఇప్పట్లో అమ్మాయిలు వాళ్లకేం కావాలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు బాగా ప్రేమించే తల్లితండ్రులు ఉన్నారు కానీ భర్త నుంచి ఒక ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే కోరుకుంటారని అది ఉండడం లేదని నిహారిక తెలిపారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్ గా అతనితో ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారా? అనే ప్రశ్న ఎదురవడంతో అలాంటిది ఏమీ లేదని ఎక్కడ కాంటాక్ట్స్ లేవని నిహారిక ఈ సందర్భంగా మరోసారి తన విడాకుల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Niharika Konidela: మహిళల వస్త్రధారణ పై నిహారిక కామెంట్స్.. లంగా ఓణితో వెళ్లలేం కదా అంటూ!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×