Niharika Konidela: నిహారిక ప్రస్తుతం తన రాకాసా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిహారిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మహిళల వస్తు ధారణ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా మహిళల వస్త్రధారణ గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిహారిక కూడా ఇదే అంశం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
మహిళలు సందర్భాన్ని బట్టి దుస్తులు వేసుకోవాలా? నా బట్టలు నా ఇష్టం అంటూ ఏవైనా వేసుకొని వెళ్ళొచ్చా దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా నిహారిక మహిళల వస్త్ర ధారణ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఏదైనా ఒక పెళ్లికి వెళుతున్నాను అంటే కచ్చితంగా శారీ వేసుకొని వెళ్తాను. నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు లంగా ఓణి వేసుకొని వెళ్లలేను కదా.. మనం వెళ్ళే సందర్భాన్ని బట్టి మన దుస్తులు కూడా ఉండాలని ఈమె క్లారిటీ ఇచ్చారు. అలాగే మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బట్టలు వేసుకోవాలి నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు నీ ఇష్టం ఎలాగైనా ఉండొచ్చని తెలిపారు. ఇక తన ఇంట్లో నేను వేసుకున్న డ్రెస్ గురించి తన పేరెంట్స్ కూడా చెబుతారని నిహారిక తెలిపారు.
మనం వేసుకున్న దుస్తుల గురించి మన ఇంట్లో వాళ్ళు ఇది మంచిగా ఉంది, ఇది లేదని చెబుతున్నారు అంటే వాళ్లు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని అర్థం కానీ, మనకు కండిషన్లు పెడుతున్నారని కాదు అంటూ నిహారిక తెలిపారు. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా డ్రస్సు వేసుకుంటే మా నాన్న ఇది నీకు సెట్ అవ్వలేదు మమ్మీ, పోనీ వేసుకో బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇలా చెబుతున్నారు అంటే మనకు కండిషన్లు పెట్టినట్టు కాదు, బయట సమాజం గురించి నాకు తెలియదు కాబట్టే వాళ్లు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారనీ అర్థం.
నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు మాత్రమే నా బట్టలు నా ఇష్టం అనే లాగా ఉండాలి కానీ బయటకు వచ్చిన తర్వాత మనం సొసైటీతో ఎన్నో రిలేషన్స్ పెట్టుకొని ఉంటాం వాటికి అనుగుణంగానే వస్త్రధారణ ఉండాలని నిహారిక తెలిపారు.
నిర్మాతగా నిహారిక సక్సెస్..
ఇలా మహిళల దుస్తుల గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక నిహారిక కెరియర్ విషయానికి వస్తే ఈమె యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక నటిగా సక్సెస్ అందుకోని నేపథ్యంలో నిహారిక నిర్మాతగా మారి ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: Niharika Konidela: పవన్ కళ్యాణ్ నాగబాబుపై పొలిటికల్ ట్రోల్స్.. నిహారిక రియాక్షన్ ఇదే!