E-Paper
Advertisement

Niharika: తెలియని బరువును మోస్తున్నా.. సంతోష  సమయంలో నిహారిక ఎమోషనల్ పోస్ట్!

Niharika: తెలియని బరువును మోస్తున్నా.. సంతోష  సమయంలో నిహారిక ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Niharika: మెగా డాటర్ నిహారిక పరిచయం అవసరం లేని పేరు. నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక (Niharika )ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. నాగబాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈమె ఆరోగ్య విషయంలో ఫిట్నెస్ విషయంలో కూడా అంతే శ్రద్ధ చూపిస్తూ ఉంటారు సమయం దొరికితే చాలు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఇలా వృత్తిపరమైన పరమైన జీవితంలో బిజీగా గడుపుతున్న నిహారిక తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

వర్ణించడానికి మాటలు లేవు..

ప్రస్తుతం మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంలో ఉండగా నిహారిక ఈ ఎమోషనల్ పోస్ట్ మాత్రం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. మరి నిహారిక చేసిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. వేదికగా ఈమె తన మనసులో ఉన్న మానసిక క్షోభ గురించి బయటపెట్టారు. ఈ సందర్భంగా నిహారిక ఒక వీడియోని షేర్ చేస్తూ నాలోపల ఏదో తెలియని బరువును మోస్తున్నాను.. అది ఒత్తిడి కావచ్చు లేదా మరేదైనా కావచ్చు.. ఆ భారాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు అంటూ ఈమె ఒక పోస్ట్ చేశారు. నేను మోస్తున్న ఈ భారానికి కృంగిపోకుండా తాను ముందుకు సాగడానికే ఆసక్తి చూపుతున్నానని ఈ భారం నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని రోజులు జిమ్ కి వెళ్లి వర్కర్స్ చేస్తున్నాను మరి కొన్ని రోజులు వాకింగ్ లేదా యోగా వంటి వాటిని చేస్తున్నానని తెలిపారు.

నిహారిక చాలా స్ట్రాంగ్…

Advertisement

ఇలా మానసిక ఒత్తిడిని వ్యాయామం వర్కౌట్ ద్వారా ఎలా జయించవచ్చు అనే విషయాలను నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ పోస్ట్ పై పలువురు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు నీహా మీరు చాలా స్ట్రాంగ్ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు నిహారిక వ్యాఖ్యలపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు నిహారిక కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం సంతోషంగా లేరనే సంగతి అందరికీ తెలిసిందే.

?igsh=dzIyNmpuZDdqYW13

Advertisement

నిహారిక ఇదివరకే వివాహం చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వైవాహిక జీవితం నుంచి బయటకు వచ్చిన ఈమె నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇలా ఈ విషయాల కారణంగానే నిహారిక ఒత్తిడి ఫీల్ అవుతున్నారా? అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మెగా కుటుంబ సభ్యులందరూ వారసుడొచ్చాడు అంటూ సంతోషపడుతున్న సమయంలో నిహారిక మాత్రం ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక నిహారిక కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై సంగీత్ శోభన్ తో కలిసి రాకాసా అనే సినిమాకు నిర్మాతక వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Anil Ravipudi: సంక్రాంతి బరిలోనే అనిల్ రావిపూడి సినిమా .. రంగంలోకి బడా బ్యానర్లు!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×