E-Paper
Advertisement

The Raja Saab: లెక్కల్ని బయటకు తీస్తున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. వాళ్లు దొరికేస్తారా?

The Raja Saab: లెక్కల్ని బయటకు తీస్తున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. వాళ్లు దొరికేస్తారా?
Advertisement

The Raja Saab: ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది. వాస్తవానికి ఈ సినిమాను ముందు చాలా తక్కువ బడ్జెట్‌తో స్టార్ట్ చేశారు. మరీ ఏమైందో ఏమోగానీ, ఒక్కసారి బడ్జెట్ పెంచేసి.. పాన్ ఇండియా హడావుడి చేశారు. ఇందులో ఉన్న నటీనటుల దృష్ట్యా, ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా పాన్ ఇండియా సినిమా అంటే ఓకే కానీ, బడ్జెట్ మాత్రం మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే, ఈ సినిమాకు అంత బడ్జెట్ ఎందుకై ఉంటుంది? ఏదో జరిగింది? అనేలా.. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ (TG Vishwa Prasad)లో కూడా అనుమానం మొదలైంది. అందుకే, ఆయన అసలు లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగినట్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యూనిట్ నుంచి వార్తలు లీకవుతున్నాయి.

Also Read- Rashmika Mandanna: రామ్ చరణ్‌కు నో చెప్పిన రష్మిక.. విషయం ఏంటంటే?

నిర్మాతకు అనుమానం

Advertisement

ముందుగా ఈ సినిమా 150 నుంచి 200 కోట్ల వరకు బడ్జెట్ అనుకున్నారు. అనూహ్యంగా 400 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లుగా ఫైనల్ లెక్కలు చూపించడంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకయినట్లుగా తెలుస్తోంది. ముందు అనుకున్న బడ్జెట్ టైమ్‌కే చాలా వరకు సినిమా చిత్రీకరణ పూర్తయిందట. బడ్జెట్ పెరిగిన తర్వాత చిత్రీకరణ చేసిన పార్ట్‌ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకింత బడ్జెట్ అయింది? ఈ సినిమాకు నిర్మాణ వ్యవహారాలు చూసుకున్న వారు ఏం చేశారు? బడ్జెట్‌లో ఎంత నొక్కేశారు? అనే అవగాహన ఇప్పటికే నిర్మాతకు వచ్చిందనేలా వార్తలు మొదలయ్యాయి. అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీసి ఉంటే, ఇప్పుడు అంత నష్టం వచ్చేది కాదని, నమ్మితే నట్టేట ముంచేశారనేలా నిర్మాత విశ్వప్రసాద్ సీరియస్ అయినట్లుగా యూనిట్ మాట్లాడుకుంటోంది. అందుకే నిర్మాణ వ్యయం మొత్తాన్ని రూపాయ్ టు రూపాయ్ ఆయన పరిశీలిస్తున్నారట.

Also Read- Telugu Comedy Drama OTT : రెండు వారాల క్రితం రిలీజ్… ఇప్పుడు ఆ భాషలల్లో కూడా అందుబాటులోకి తెలుగు కామెడీ డ్రామా

రూ. 100 కోట్లు బొక్కేశారు

Advertisement

మరి ఈ పరిశీలనలో కనుక తేడాలు ఉన్నట్లుగా కనుక నిరూపితమైతే మాత్రం, కఠినంగా చర్యలు తీసుకోవాలనే ప్లాన్‌లో నిర్మాత ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ వ్యవహారంలో దాదాపు రూ. 100 కోట్ల వరకు తినేశారనేలా ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇటీవల నిర్మాత నట్టి కుమార్ కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. ‘దాదాపు రూ. 100 కోట్లను మధ్యలోని వారే బొక్కేశారు. పాపం, ఆ నిర్మాత మంచిగా సినిమాలు చేసి, ఇండస్ట్రీకి ఫీడింగ్ ఇవ్వాలని చూస్తుంటే, ఆయననే మోసం చేశారు. ఈ విషయం ప్రభాస్‌కు కూడా తెలిసి ఉండకపోవచ్చు’ అనేలా నిర్మాత నట్టి కుమార్ మీడియాకు చెప్పారు. అందుకే నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు కూడా అనుమానం మొదలైంది. ఇకపై దగ్గరుండి అంతా చూసుకోవాలనే నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఫైనల్‌గా టీజీ విశ్వప్రసాద్ ఏం చేయబోతున్నారో, అసలు నిందితులను బయటకు లాక్కొచ్చి శిక్ష విధిస్తారా? లేదంటే, తన బ్యానర్ పరువు పోతుందని కామ్‌గా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? అనేది చూడాల్సి ఉంది.

Also Read- Lavanya Tripathi: ఉపాసనకు ట్విన్స్.. మరో మెగా కోడలి స్పందనిదే!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×