E-Paper
Advertisement

Swayambhu Release: నిఖిల్ స్వయంభు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 8 భాషలలో?

Swayambhu Release: నిఖిల్ స్వయంభు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 8 భాషలలో?
Advertisement

Swayambhu Release: హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్నారు నటుడు నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddarth). ఈయన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి సినిమాలన్నిటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం “స్వయంభు”(Swayambhu). భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పీరియాడికల్ మైథాలజికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్రబృందం ఒక వీడియో రిలీజ్ చేశారు దీనితో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

8 భాషలలో స్వయంభు..

ఈ సినిమా 2026 ఫిబ్రవరి 13వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో భవన్, శ్రీకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్, నా బావ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తుండటం విశేషం.దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాగా, రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమైన తర్వాత కేవలం 170 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసుకుంది.

చరిత్ర చెప్పని యోధుడి కథ..

Advertisement

ఇక ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే ఎంతో కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఇప్పటివరకు నిఖిల్ సినిమాలు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యాయి కానీ, కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మాత్రం తెలుగు, హిందీ, తమిళ , కన్నడ, మలయాళ భాషలతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. భారతదేశ చరిత్రలోనే చెప్పని ఒక యోధుడి కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Advertisement

తాజాగా విడుదల చేసిన ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇకపై సినిమా నుంచి వరుస అప్డేట్స్ వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Puri -Vijay Sethupathi: గుమ్మడికాయ కొట్టేసిన పూరి.. పనిలో పనిగా సేతుపతి లుక్ కూడా వచ్చేసింది

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×