E-Paper
Advertisement

Swayambhu Teaser: నిఖిల్ ‘స్వయంభు’ టీజర్ వచ్చేసింది.. ఇది మామూలుగా లేదుగా..

Swayambhu Teaser: నిఖిల్ ‘స్వయంభు’ టీజర్ వచ్చేసింది.. ఇది మామూలుగా లేదుగా..
Advertisement

Swayambhu Teaser: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై, ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. ఈ చిత్రం 985 AD కాలం నాటి కథతో తెరకెక్కింది. పరమశివుడు స్వయంగా శ్రీరాముడికి బహుకరించిన పవిత్రమైన ‘శెంగోల్’ (ధర్మ దండం) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ పవిత్ర దండం కోసం రాజ్యాల మధ్య జరిగే భీకర యుద్ధాలు, ధర్మాన్ని కాపాడటం కోసం ఒక వీర యోధుడు చేసే పోరాటమే ఈ ‘స్వయంభు’. చరిత్రలో మరుగున పడిపోయిన కొన్ని పురాతన అంశాలను దర్శకుడు భరత్ కృష్ణమాచారి వెండితెరపై ఆవిష్కరించారు.

Read also-SitaPayanam Movie: అర్జున్ సీతాపయనం మూవీ హీరో బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Advertisement

ఈ టీజర్‌లో నిఖిల్ లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిఖిల్ అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. కేవలం రూపంలోనే కాకుండా, యుద్ధ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్ తీవ్రత సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కేతికంగా ఈ సినిమా హాలీవుడ్ ప్రమాణాలను తలపిస్తోంది. బాహుబలి’ ఫేమ్ కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను ఒక విజువల్ వండర్‌లా మార్చింది. బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) టీజర్‌కు ప్రాణం పోసింది. యుద్ధ సన్నివేశాల్లో వచ్చే శబ్దాలు ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.పిక్సెల్ స్టూడియోస్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రొడక్షన్ డిజైన్ మరియు VFX నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

Read also-Tollywood : ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న టాలీవుడ్ హీరోలు..రవితేజ ప్లాన్ మాములుగా లేదు..

Advertisement

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×