E-Paper
Advertisement

సినిమాల్లో మహిళల అశ్లీలతపై నిత్యా మీనన్ ఫైర్.. గీత దాటకూడదంటూ..!

సినిమాల్లో మహిళల అశ్లీలతపై నిత్యా మీనన్ ఫైర్.. గీత దాటకూడదంటూ..!
Advertisement

Nithya Menen: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ (Peddi) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, చిత్రంలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై ప్రస్తుతం తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో, సినిమాల్లో మహిళలను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించడంపై ప్రముఖ నటి నిత్యా మీనన్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ధోరణి కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాలేదని, ఇండస్ట్రీ అంతటా ఉందంటూ ఆమె స్పష్టం చేశారు.

Advertisement

సినిమా హైపర్-కమర్షియలైజేషనే దీనికి కారణం: నిత్యా మీనన్
‘వెరైటీ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ మాట్లాడుతూ.. సినిమాల్లో మహిళలను వస్తువులుగా చూపించడం అనేది ఒక ట్రెండ్‌గా మారిపోయిందని అన్నారు.

“సినిమాలు విపరీతంగా కమర్షియల్ అయిపోవడమే దీనికి ప్రధాన కారణం. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కోసం, ప్రేక్షకులను ఆకర్షించడానికి ఏది వర్కవుట్ అవుతుందో దాన్నే చూపిస్తున్నారు. ఇది మరీ మితిమీరిపోతోందా? అంటే.. ఖచ్చితంగా అవుననే చెబుతాను. నటీనటులే తమకంటూ కొన్ని హద్దులు పెట్టుకోవాలి. సదరు సీన్ చేస్తున్నప్పుడు.. తము అలా కనిపించడానికి ఇష్టపడట్లేదని ఖరాఖండిగా చెప్పగలగాలి.” అని నిత్యా పేర్కొన్నారు.

Advertisement

తాను స్టార్‌డమ్ లేదా ఫేమ్ కంటే తన వ్యక్తిగత విలువలకే ప్రాధాన్యత ఇస్తానని, అందుకే కొన్ని రకాల పాత్రలు, జోనర్లకు దూరంగా ఉంటానని ఆమె వెల్లడించారు. ఒకవేళ నటీనటులు కేవలం టాప్ స్టార్స్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని, దేనికైనా సిద్ధపడితే అది వారి వ్యక్తిగత నిర్ణయమని ఆమె అన్నారు.

అసలేంటి ‘పెద్ది’ వివాదం?
బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా, అశ్లీలంగా చూపించారంటూ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె క్యారెక్టర్‌ని కథ పరంగా కాకుండా, కేవలం బాడీని ఎలివేట్ చేసేలా ఇంట్రడక్షన్ సీన్ పెట్టడంపై మండిపడ్డారు. అంతేకాకుండా, సినిమాలో హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా హీరో (రామ్ చరణ్) ఆమెను వెంటాడటం, చివరకు ఆమె అనుమతి లేకుండా ముద్దు పెట్టుకునే సీన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు:
ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సన స్పందిస్తూ.. తనకు నిజ జీవితంలోనూ, తన కథల్లోనూ మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, ఎవరినీ తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను గౌరవిస్తూ, అభ్యంతరకరంగా ఉన్న సీన్లను సినిమాలో నుండి తొలగించడానికి (Modify) మేకర్స్ నిర్ణయించారని తెలుపుతూ, బాధపడిన వారికి ఆయన క్షమాపణలు చెప్పారు.

Related News

ఎన్టీఆర్–నీల్ మూవీ.. హైప్ ఎక్కువైపోతుందా?

సంగీత్ శోభన్ ‘అంతా రాములోరు చూస్కుంటారు’ గ్లింప్స్ రిలీజ్!

‘రాకా’లో పృథ్వీరాజ్.. ఏమన్నారంటే?

విడుదలకు ముందే జైలర్ 2 సరికొత్త రికార్డ్.. భారీ ధరకు నాన్ థియేట్రికల్ హక్కులు!

చిరు డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా..!

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

Big Stories

Advertisement
×