E-Paper
Advertisement

Star Actress: చికిత్సకు డబ్బులు కావాలి.. నన్ను ఎవరు పెళ్లి కూడా చేసుకోవడం లేదు.. తెలుగు స్టార్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..!

Star Actress: చికిత్సకు డబ్బులు కావాలి.. నన్ను ఎవరు పెళ్లి కూడా చేసుకోవడం లేదు.. తెలుగు స్టార్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..!
Advertisement

Star Actress ఇటీవల సెలబ్రిటీ ఇంటర్వ్యూల్లో.. తమ పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొంటున్న కష్టాలను సైతం ధైర్యంగా చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమాల వెనుక ఉన్న మెరుపుల ప్రపంచం మాత్రమే కాదు, అక్కడి కష్టాలు, ఒంటరితనం, ఆరోగ్య సమస్యలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తన జీవితంలోని చేదు నిజాలను.. కెరీర్ బ్రేక్ వెనుక ఉన్న కారణాలను ఓపెన్‌గా పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో.. అవకాశాల కాలం చాలా తక్కువ. అదే సమయంలో పేరు, గుర్తింపు, ఆర్థిక భద్రత సాధించాల్సి ఉంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కొందరు ఒక్కటి రెండు సినిమాలకే పరిమితమవుతారు. మరికొందరు మంచి స్థాయిలో ఉన్నప్పుడే అనుకోని కారణాలతో ఇండస్ట్రీకి దూరమవుతారు. అలాంటి వారిలో ఒకరు ఆనందం సినిమాతో యువత మనసులు గెలిచిన హీరోయిన్ రేఖ వేదవ్యాస్.

Advertisement

ఆనందం సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె టాలీవుడ్‌కు దూరమయ్యారు. తరువాత కొద్ది కాలం ఇతర భాషల్లో నటించినా, చివరికి పూర్తిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా ఏళ్ల పాటు ఆమె ఎక్కడ ఉన్నారు, ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రేఖ తన జీవితం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, దాని వల్ల శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా కుంగిపోయానని చెప్పారు. సినిమాలపై ప్రేమ తగ్గలేదని, తిరిగి నటించాలని ఉందని తెలిపారు. అయితే చికిత్స ఖర్చులు, ఆరోగ్య పరిస్థితులే తన నిర్ణయాలను ప్రభావితం చేశాయని తెలిపారు.

Advertisement

పెళ్లి విషయంపై కూడా ఆమె ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు పెళ్లిపై ఆసక్తి లేకపోయిందని, తర్వాత మనసు మారి పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదని తెలిపారు. తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల దాకా వెళ్లే బంధాలకంటే, ఆలస్యమైనా సరైన సంబంధం కావాలని ఆమె అభిప్రాయం. ఒకసారి పెళ్లి అయితే దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, సోషల్ మీడియా.. కార్పొరేట్ ప్రభావం పెరిగిందని రేఖ అన్నారు. ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డానంటే అది దేవుడి దయేనని చెప్పింది. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమెకు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశిస్తున్నారు.

ALSO READ: Arjun sarja: విశ్వక్ సేన్ తో గొడవ.. సీతా పయనం సినిమాపై క్లారిటీ ఇచ్చిన అర్జున్ సర్జా!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×