E-Paper
Advertisement

‘డ్రాగన్’ లుక్ కోసం తారక్ ప్రాణం పెడితే వాళ్లు మాత్రం.. ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

‘డ్రాగన్’ లుక్ కోసం తారక్ ప్రాణం పెడితే వాళ్లు మాత్రం.. ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

NTR Dragon: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ఇంటెన్స్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ (Dragon). ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. గత చిత్రాలతో పోలిస్తే తారక్ చాలా లీన్ గా, పవర్‌ఫుల్ అసాసిన్ (హంతకుడు) లా కనిపిస్తున్నారు. అయితే, ఈ లుక్ వెనుక ఎన్టీఆర్ పడ్డ కఠోర శ్రమను, ఆ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Read also-గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడేలా ఉందంటే..?

Advertisement

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక ఆఫ్ఘనిస్తాన్‌లో శిక్షణ పొందిన డేంజరస్ హంతకుడి పాత్రను పోషిస్తున్నారు. ఆ క్యారెక్టర్‌కు పక్కాగా సెట్ అవ్వాలంటే శరీరం చాలా లీన్ గా మారాలని, బుగ్గలు లోపలికి వెళ్లాలని తాను ఎన్టీఆర్‌తో అన్నట్లు ప్రశాంత్ నీల్ చెప్పారు. తాను కేవలం ఒక మాట మాత్రమే చెబితే, ఎన్టీఆర్ మాత్రం దానిని చాలా సీరియస్ గా తీసుకుని ఊహించని రేంజ్‌లో కష్టపడ్డారని తెలిపారు. క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఎన్టీఆర్ ఏకంగా 15 నుండి 16 కిలోల బరువు తగ్గారని నీల్ వివరించారు.

ఎన్టీఆర్ బరువు తగ్గే ప్రాసెస్ లో పడ్డ శ్రమను చూసి తాను కూడా షాక్ అయ్యానని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. “తారక్ బరువు తగ్గే క్రమంలో చాలా సన్నగా, కాస్త వీక్ గా కనిపించడం మొదలైంది. అది చూసి నేను చాలా సార్లు బరువు తగ్గడం ఆపేయమని తారక్‌కు చెప్పాను. కానీ ఆయన వినలేదు. ‘నువ్వు రాసుకున్న కథకు ఎలాంటి లుక్ కావాలో, అది నేను తెచ్చి తీరుతాను’ అంటూ మొండిగా ముందుకు వెళ్లారు” అని ప్రశాంత్ నీల్ చెప్పారు.

Advertisement

అయితే తారక్ అలా లీన్ గా మారిపోతుండటం చూసి ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారట. ఎన్టీఆర్ అలా కష్టపడటానికి కారణం ప్రశాంత్ నీల్ అని భావించి.. ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి ఇద్దరూ తనపై చాలా కోపంగా ఉండేవారని ప్రశాంత్ నీల్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో కూడా తారక్ ఆరోగ్యం బాలేదంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అదంతా నా వల్ల కాలేదు, క్యారెక్టర్ కోసం తారక్ ఉన్న పట్టుదల వల్లే జరిగింది. ఆయూనొక నిజమైన మ్యాడ్ మ్యాన్ అంటూ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డెడికేషన్‌ను కొనియాడారు.

Read also-Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మనోజ్ కు అనుమానం.. మీనాకు కళ్యాణ్ ఆఫర్.. బాలుకు దొరికిన విల్లా విజయ్..

తాను చెప్పిన వెంటనే ఎన్టీఆర్ తన ట్రైనర్‌ను పిలిపించుకుని, మరుసటి రోజు ఉదయం నుంచే కఠినమైన డైట్, వర్కౌట్స్ మొదలుపెట్టారని ప్రశాంత్ నీల్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ పడ్డ ఈ 4 నెలల కష్టానికి, త్యాగానికి తగ్గట్లే ‘డ్రాగన్’ అవుట్‌పుట్ అదిరిపోయేలా వచ్చిందని, తామంతా ఆ లుక్ చూసి ఎంతో హ్యాపీగా ఉన్నామని దర్శకుడు తెలిపారు. 2027 జూన్ 11న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related News

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

Big Stories

Advertisement
×