Gundeninda GudiGantalu Today episode May21st: రోహిణి వంటగదిలోకి రాగానే మీనా ఏంటి రోహిణి నువ్వు రౌడీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నావా? ఏదైనా అప్పు చేసావా అని అడుగుతుంది.. నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు ఇంతకీ నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అంటే మా తమ్ముడు చెప్పాడు అని చెప్పగానే రోహిణి షాక్ అవుతుంది.. ఇప్పుడే నాకు ఇంట్లో స్థానం లేకుండా పోయింది ఇక ఈ నిజం కూడా బయటపడితే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు అని భయపడిపోతుంది.. ఇక తర్వాత రవి, బాలు కూడా రోహిణి గుణ దగ్గర అప్పు చేస్తుంది అని మాట్లాడుకుంటారు.. మనోజ్ కి విషయం చెప్తే మనోజ్ గొడవకి దిగుతాడు. రోహిణి గురించి మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను అసలు ఊరుకోను అని వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చి మనోజ్ కిందకి వస్తాడు.
రోహిణి కోసం మనోజ్ ఎదురు చూస్తూ ఉండగా రోహిణి ఎదురుగా వచ్చి మనోజ్ ని ఢీకొట్టింది. బుర్ర ఎక్కడ పెట్టావు? ఆ మాత్రం చూసుకోకుండా వచ్చావా ఏంటి అని రోహిణి మనోజ్ ని తిడుతుంది. మనోజ్ నువ్వెక్కడ ఫోన్లో పెట్టుకుని నడుస్తూ వచ్చావు కదా నువ్వే నన్ను ఢీకొట్టావు అని అనగానే నేను ఏదో అర్జెంటు మెసేజ్ చేయడానికి టెక్స్ట్ టైప్ చేస్తూ ఉన్నాను అప్పుడే డాష్ ఇచ్చాను అని అనగానే ముందు అది చెప్పు అని మనోజ్ అంటాడు. రోహిణి మీ నాన్న మలేషియాలో పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నారా..? మలేషియాలో మీకు ఆస్తులు ఉన్నాయా అని మనోజ్ అడగ్గానే రోహిణి నీళ్లు నమ్ముతుంది. ఏంటి మనోజ్ కి అనుమానం వచ్చినట్లు ఉంది అని అనుకుంటుంది. మా నాన్న గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావ్ ఎన్నిసార్లు చెప్పాలి అని రోహిణి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది.
ఇది పక్కన పెట్టు నువ్వు గుణ దగ్గర అప్పు చేసావా అని మనోజ్ అడుగుతాడు. నాకు మీనాకు కూడా నామీద అనుమానం వచ్చింది ఇప్పుడు మనోజ్ కూడా అదే చెప్పారు అని రోహిణి కంగారు పడిపోతుంది. వాడొక రౌడీ వాడి దగ్గర నువ్వెందుకు అప్పు చేసావు అని మనోజ్ అడుగుతాడు. ఏమో చిన్న చిన్న ఖర్చులు ఉంటే అప్పు చేసాను మనోజ్ అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు వాడు మీరు అనుకున్నట్టుగా చెడ్డవాడు ఏం కాదు మంచివాడే అని రోహిణి అంటుంది. ఇకమీదట ఆ రౌడీ దగ్గర నువ్వు అప్పు చేయొద్దు ఇంతకీ నువ్వు ఎవరెవరి దగ్గర అప్పు చేసావో ఆ లిస్ట్ నాకు ఒకసారి ఇవ్వు అని అనగానే రోహిణి ఏంటి నువ్వు అప్పు కడతావా అని అడుగుతుంది. కట్టకపోయినా నేను ట్రై చేస్తాను అని మనోజ్ అంటాడు. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి రోహిణి తప్పించుకుంటుంది..
సత్యం బాధ పడిపోతూ ఉంటాడు. ఏంటి నాన్న ఇంకా మీరు పడుకోలేదా ఎందుకు ఇంకా మేలుకొని ఉన్నారు అని మన బాలు అడుగుతాడు. నిద్ర పట్టడం లేదు రా ఇన్ని సమస్యల వల్ల నాకు నిద్ర రావడం లేదు అని సత్యం అంటాడు. మీరేం కంగారు పడకండి నాన్న నేను చూసుకుంటాను కదా మీరు వెళ్లి పడుకోండి అని బాలు మాటిస్తాడు. మీనా మావయ్య గారి కోసం ఏదో ఒకటి చేయాలండి అని అంటుంది. మనం వెళ్లి ఆ టీవీ యాక్టర్ ని కలుద్దాం ఆయన అడిగి నిజం రా బడదామని అంటాడు. ఇక మీనా బాలు కోసం పాలు ఇవ్వగా సగం తాగి మళ్లీ మీనా కోసం బాలు పాలిస్తాడు. ఇది మన ఫస్ట్ నైట్ అనుకొని పాలు తాగు అని అనగానే మీనా సిగ్గు పడిపోతుంది. ఈ సీను కాస్త రొమాంటిక్గా అనిపిస్తుంది..
బాలు ఇద్దరు కలిసి ఉదయం టీవీ యాక్టర్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ బాలుని మీనా పరిచయం చేస్తుంది.. ముళ్ళకంప పూలగంపాని వాళ్ళిద్దరూ పెట్టుకున్న పేర్లని చెప్పడంతో కళ్యాణ్ మీరు చాలా సరదాగా ఉన్నారు అని అంటాడు.. బాలు మీనాలను చూసి కళ్యాణ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు.. మీరు నటించిన సీరియల్స్ అన్ని నేను చూస్తాను సార్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అని బాలు మాటలు కలిపే ప్రయత్నం చేస్తాడు.. అతనితో కలిసి సెల్ఫీలు దిగుతాడు.. ఆ తర్వాత మీరు ఒక విల్లా దగ్గర కనిపించారు ఫోటో దిగడం అనుకునే లోపల మీరు వెళ్లిపోయారు అని అనగానే అవును ఆ విల్లా అని నేను కొందామని వెళ్ళాను కానీ వాడొక ఫ్రాడ్ లాగా కనిపించడంతో అక్కడి నుంచి వచ్చేసాను అని కళ్యాణ్ అంటాడు.. మీరు తెలివిగా తప్పించుకున్నారు మా అన్నయ్య అడ్డంగా ఇరుక్కుని 30 లక్షలు కట్టాడు అని అనగానే కళ్యాణ్ ఆ వ్యక్తి గురించి నిజం చెప్తాడు.
చింతామణి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా లోపలికి వస్తుంది.. చెప్పులు బయట వదిలేసి వస్తే బాగుంటుంది అని కళ్యాణ్ అనగానే తాను చాలా ఫీలయ్యి చెప్పులను బయట వదిలేయడానికి వెళుతుంది.. ఫంక్షన్ కాంట్రాక్ట్ గురించి మీతో మాట్లాడదామని వచ్చాను అని చింతామణి అనగానే నేను ముందుగా మీరు వచ్చారు కాబట్టి మీకు స్టేజ్ మండపం డెకరేషన్ మీకు ఇస్తాను మిగతా మొత్తం మీనా గారు చేస్తారు అని అనగానే చింతామణి షాక్ అవుతుంది. మీనా గురించి ఎంతగా చెప్పడానికి ప్రయత్నించిన సరే కళ్యాణ్ మాత్రం మీ నాకు ఒక ఛాన్స్ ఇస్తాను అని అంటాడు. తనకి కళ్యాణ్ మీనా కి అదిరిపోయే ఆఫరిస్తాడు.. బయటికి వచ్చిన తర్వాత చింతామణి మీనా కి వార్నింగ్ ఇవ్వాలనుకుంటుంది కానీ బాలు దెబ్బకి చింతామణి ఫ్యుజులు ఎగిరిపోతాయి..
విల్లా విజయ్ కోసం మీనా బాలు లాంగ్ డ్రైవ్ కు వెళ్తారు. ఇద్దరు కలిసి ధవలేశ్వరం వెళ్లి ఆ విజయ్ గాని వెతకాలని అనుకుంటారు. ప్రభావతి ఫోన్ చేయగానే బాలు మీరు మాట్లాడాలనుకుంటున్న వ్యక్తి రెండు గంటల వరకు అందుబాటులో ఉండరు అని అనడంతో ప్రభావతి ఫీల్ అవుతుంది.. ఇంటికి వచ్చిన తర్వాత వాడి సంగతి ఏంటో చెప్తాను అని ప్రభావతి అనుకుంటుంది.. ఇక బాలు మీద ఇద్దరు ఆ ఊరిలో జల్లెడ పట్టి విజయ్ అనే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు.. చేపలు అమ్ముతూ కనిపించిన వాళ్ళని చూసి మీనా బాలు ఇద్దరు కూడా దొరికారు అని అనుకుంటారు.. అయితే బాలు మీన వాళ్ళని పట్టుకొని చితగ్గొట్టేస్తారు మనోజ్ వల్ల మళ్ళీ చేయి జారిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..