E-Paper
Advertisement

సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. వర్క్ అవుట్ అవుతుందా?

సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. వర్క్ అవుట్ అవుతుందా?
Advertisement

NTR Neel:ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం డ్రాగన్. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రశాంత నీళ్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ పర్ఫామెన్స్ కలగలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించబోతున్నారు. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈలోగా అభిమానులను నిరాశపరచకుండా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేశారు. అయితే ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేసే టైం లో కూడా ఎన్టీఆర్ తన సెంటిమెంటును చూసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఎన్టీఆర్ గ్లింప్స్ కి ముహూర్తం పిక్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ మే 20వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయ్యింది. ముఖ్యంగా విడుదల సమయం వెనుక కూడా ఎన్టీఆర్ సెంటిమెంటును తెరపైకి తీసుకొచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ తన కారు నంబర్ల తోపాటు ఇతర ముఖ్యమైన విషయాల వరకు 9 అనే అంకెను ఆయన తన లక్కీ నెంబర్ గా భావిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇటు ప్రశాంత్ నీళ్ మూవీలో కూడా అదే సెంటిమెంటును ఆయన ఉపయోగిస్తున్నారు. ప్రశాంత్ నీళ్ సినిమా నుంచి వచ్చే గ్లింప్స్ సమయాన్ని కూడా 9 నంబర్ వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

also read:ఇండస్ట్రీలో విషాదం.. వన్ లైఫ్ టు లివ్ నటి మృతి.. అసలేం జరిగిందంటే?

సెంటిమెంట్ రిపీట్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సరిగ్గా మే 20 అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాలకు (1+2+0+6=9) ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ టైమింగ్ తోనే తారక్ మాస్ జాతర మొదలు కాబోతోంది అని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటు గ్లింప్స్ విషయంపై కూడా ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. పక్కా ప్లానింగ్ ప్రకారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ గ్లింప్స్ ఇటు సోషల్ మీడియాలో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఎన్టీఆర్ కెరియర్..

Advertisement

ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా కష్టపడుతున్నారు. అటు తన బావమరిది నార్నే నితిన్ వివాహ సమయంలో తన లుక్ తో అందరిని ఆశ్చర్యపరిచిన ఎన్టీఆర్.. ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కనిపించి.. మరోసారి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాలి.

Related News

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Big Stories

Advertisement
×