E-Paper
Advertisement

బండి భగీరథ్ అరెస్ట్ ఆలస్యంపై ప్రకాష్ రాజ్ ఫైర్!

బండి భగీరథ్ అరెస్ట్ ఆలస్యంపై ప్రకాష్ రాజ్ ఫైర్!
Advertisement

Prakash Raj:17 సంవత్సరాల బాలికను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ సదరు బాధితురాలు తల్లి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా.. పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే మే 8వ తేదీన బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు అయినప్పటికీ. ఇప్పటికీ బండి భగీరథ్ ను అరెస్టు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ విషయంపై సినీ తారలు కూడా జోక్యం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే నిన్నటికి నిన్న మంచు మనోజ్ ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. నిందితులను పట్టుకోవడంలో ఆలస్యం తగదు.. వెంటనే నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం కల్పించండి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

బండి భగీరథ్ ను అరెస్టు చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బండి భగీరథ్ అరెస్టు ఆలస్యంపై ప్రశ్నించారు. అయితే ఇప్పుడు మరో సినీ సెలబ్రిటీ ఈ విషయంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎవరో కాదు ప్రకాష్ రాజ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పై నమోదైన ఈ పోక్సో కేసుపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందిస్తూ నిందితుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. బాలికను వేధించారనే ఆరోపణలతో నమోదైన కేసు ఇన్ని రోజులు అవుతున్నా.. నిందితుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రకాష్ రాజు ప్రశ్నించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నినదించే ” భేటీ బచావో.. భేటీ పడావో” అనే నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే..” భేటీ బచావో కాదు.. బేటా బచావో” లాగా కనిపిస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.

బండికి పారిపోయిన అమానుష బండి..

Advertisement

ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ నేరుగా ప్రశ్నలు సంధించారు?” బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్టు చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు” అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరొకవైపు ఈ కేసును కొట్టి వేయాలి అని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించగా.. మరొకవైపు పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలి అని.. ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ పెరుగుతోంది.

also read:సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. వర్క్ అవుట్ అవుతుందా?

స్పందించిన రేవంత్ రెడ్డి..

Advertisement

ఇప్పటికే ఈ కేసు పై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. వెంటనే ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించాలని డిజిపిని కూడా ఆయన ఆదేశించారు. ఇక డిజిపి ఆదేశాల మేరకు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులతో సమావేశమైన డీసీపీ రితిరాజ్ కేసు వివరాలను తెలుసుకున్నారు. వెంటనే బాధితురాలికి న్యాయం జరిగేలా ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బండి భగీరథ్ ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×