E-Paper
Advertisement

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ వచ్చేది ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి అప్టేట్ ఏం లేకుండానే షూటింగ్ మొత్తం సాగుతోంది. ఈ సినిమా నుంచి వచ్చే అప్టేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-రామ్ చరణ్‌కు ‘రంగస్థలం’ స్థాయిని అందుకోవడం సాధ్యమేనా?.. ‘పెద్ది’పై ఫ్యాన్స్ ఆందోళన!

బర్త్‌డే కానుకగా గ్లింప్స్

Advertisement

మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, మే 19 అర్ధరాత్రి లేదా మే 20 ఉదయాన్నే ‘NTRNeel’ చిత్ర అధికారిక టైటిల్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. టైటిల్‌తో పాటు తారక్ పవర్‌ఫుల్ లుక్‌ను రివీల్ చేస్తూ ఒక చిన్న ‘గ్లింప్స్’ లేదా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read also-Podarillu Today Episode : చక్రీ మామూలోడు కాదు..కన్నీళ్లు పెట్టుకున్న మహా.. గాయత్రిని చూసి కన్నా షాక్..

సినిమా హైలైట్స్

Advertisement

‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ కనిపించనుంది. అలాగే, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్‌తో పాటు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా గురించి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. దీంతో ఈ ఏడాది తారక్ పుట్టినరోజున అభిమానులకు అసలైన ‘మాస్ ఫీస్ట్’ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×