E-Paper
Advertisement

Anil Ravipudi: అవకాశం అనేది కంటెంట్‌ని బట్టే వస్తుంది.. నవ్వించడం అంత సులభం కాదు..: అనిల్ రావిపూడి

Anil Ravipudi: అవకాశం అనేది కంటెంట్‌ని బట్టే వస్తుంది.. నవ్వించడం అంత సులభం కాదు..: అనిల్ రావిపూడి
Advertisement

Anil Ravipudi: వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి తర్వాత అంతటి హిట్ రేషియో సాధించిన దర్శకుడిగా ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయం సాధించడంతో మరోసారి అనిల్ రావిపూడి పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రముఖ బిగ్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా ప్రయాణం, కామెడీ స్టైల్, కంటెంట్ ఎంపికపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అనిల్ రావిపూడి సినిమాలు గుర్తుండిపోవడానికి కారణం అదే..!

ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. మీరు ప్రధాన పాత్రలతో పాటు పక్కన ఉన్న క్యారెక్టర్లతో కూడా కామెడీ బాగా పండిస్తారని ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందిస్తూ..“కథలో సహజంగా వచ్చే వన్ లైనర్స్‌కే ఎక్కువ రీకాల్ వాల్యూ ఉంటుంది. ఆడియన్స్ కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూసినప్పుడు అలాంటి డైలాగ్స్ బాగా గుర్తుంటాయి. ప్రతి సినిమాలోనూ ఆడియన్స్ ఏదో ఒక విషయం తీసుకెళ్తున్నారు అంటే, వాళ్లు ఆ కథతో కనెక్ట్ అవుతున్నారన్న మాట” అని అన్నారు.

Advertisement

తన కెరీర్ ప్రారంభ దశలో చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాక్స్ ఇప్పటికీ గుర్తుండిపోవడానికి ఇదే కారణమని తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు చేసిన అనిల్ రావిపూడి..“కామెడీలో ఇంకా ఎలా కొత్తగా ప్రయత్నించాలి, ఇంకా ఎలా మెరుగుపరచాలి అనేది నిరంతరం ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. ప్రతి సినిమాకు అది కొత్తగా వర్క్ అవుతుంది” అని చెప్పారు.

Advertisement

తన సినిమాల్లో ఫన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
“ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఒక స్ట్రాంగ్ కంటెంట్, ఒక బలమైన ఎమోషనల్ పాయింట్ ఉండేలా చూసుకుంటాను. ఫన్ మాత్రమే కాదు, ఆడియన్స్‌ను దగ్గర చేసే అంశాలు కూడా చాలా ఉంటాయి” అని అన్నారు.

పాటలు, యాక్షన్, ఫ్యామిలీ ఫన్ అన్నీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు రూపొందిస్తున్నానని తెలిపారు. “సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్లెండ్‌ను ఇంకా బాగా ఫోకస్ చేశాను. సినిమా టు సినిమా మనం ఎంత ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తే.. ఆడియన్స్‌కు అంత దగ్గర అవుతాం” అని చెప్పారు.

F2, F3 సినిమాల గురించి మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్ అందరికీ కనెక్ట్ అయ్యే అంశమని అన్నారు. “వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే.. అది ఒక యూనివర్సల్ పాయింట్. ప్రతి ఇంట్లో ఏదో ఒక స్థాయిలో ఆ ఫన్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అదే నేను టచ్ చేశాను. అందుకే ఆ సినిమాలు అంత పెద్ద హిట్స్ అయ్యాయి” అని తెలిపారు.

అలాగే ఆ జానర్‌లో ఇంకా చాలా కోణాలు.. విలువలు చూపించడానికి అవకాశం ఉందన్నారు.
“ఫన్‌తో పాటు వాల్యూస్ కూడా చెప్పాలి. ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండేలా చూసుకుంటాను” అని చెప్పారు. యంగ్ డైరెక్టర్ల స్ట్రగుల్స్ గురించి అడిగిన ప్రశ్నకు అనిల్ రావిపూడి స్పష్టంగా సమాధానం ఇచ్చారు. “అవకాశం అనేది ఎప్పుడూ కంటెంట్‌ని బట్టే వస్తుంది. మన దగ్గర మంచి కథ ఉంటే అపర్చునిటీ తప్పకుండా వస్తుంది” అని అన్నారు.

అంత సులభం ఏమీ కాదు..!

సినిమా తీయడం అంత ఈజీ కాదని, బయటికి ఈజీగా కనిపించినా దాని వెనక చాలా కష్టం ఉంటుందని చెప్పారు. “ఒక కామెడీ సీన్ రాయడం, దాన్ని ఆడియన్స్‌ను నవ్వించేలా తెరకెక్కించడం చాలా కష్టం. యాక్షన్ సీన్ కష్టమే అయినా, కామెడీ సీన్ కూడా అంతే కష్టం” అని తెలిపారు.

చివరగా.. తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయడం వెనక భారీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్, టీమ్ ఎఫర్ట్స్, స్ట్రెస్ ఉంటాయని చెప్పారు. “బయటికి ఈజీగా కనిపించినా, సినిమా తీయడం ఎప్పుడూ ఈజీ కాదు. దాని వెనక చాలా ప్రాసెస్, చాలా కష్టం ఉంటుంది” అంటూ అనిల్ రావిపూడి తన మాటలను ముగించారు.

ALSO READ: The Paradise: నాని సినిమాలో ఎక్కువ అయిపోతున్న విలన్లు..!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×