E-Paper
Advertisement

Darshanam Mogilaiah : పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య దురదృష్టకరమైన పరిస్థితి

Darshanam Mogilaiah : పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య దురదృష్టకరమైన పరిస్థితి
Advertisement

Darshanam Mogilaiah : కళాకారులు ఎక్కువగా కోరుకునేది కేవలం కొంత గుర్తింపు, కొన్ని ప్రశంసలు మాత్రమే. డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నా కూడా కొంతమంది కేవలం కళారంగాన్ని మాత్రమే ఎంచుకొంటారు. దానిలో కొంత సంతృప్తి అనేది ఉంటుంది. అయితే ఒక మనిషి గుర్తింపును చెరిపేస్తున్నప్పుడు బాధ కలగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.

పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య కు అటువంటి దురదృష్టకర పరిస్థితి ఎదురైంది. తెలంగాణ జానపద కళలకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ కళాకారుల్లో దర్శనం మొగులయ్య ఒకరు. గద్దర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజా ఉద్యమాల స్వరంగా నిలిచిన గాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పాటనే ఆయుధంగా మార్చుకుని, అణగారిన వర్గాల బాధలను, వారి పోరాటాలను తన గళంతో ప్రపంచానికి వినిపించిన గొప్ప ప్రజాకళాకారుడు దర్శనం మొగులయ్య.

దురదృష్టకరమైన పరిస్థితి 

Advertisement

దర్శనం మొగులయ్యకు 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందించింది. ఇది తెలంగాణ జానపద కళలకు, ప్రజాకళాకారులకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. ఈ అవార్డు ద్వారా దేశం మొత్తం ఆయన కళను గుర్తించింది.

అయితే హైదరాబాదులోని కొన్ని ప్రదేశాల్లో ఆయన ఫోటోలు కూడా పెయింట్ చేశారు. చాలామంది కళాకారులని గుర్తించాలి అనే ఉద్దేశంతోనే అలా ఫోటోలు గీశారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఆ ఫోటోలు కూడా కనిపించకుండా వాళ్ల బ్రాండ్లను, వాళ్ల ఇన్స్టిట్యూట్ లను పాపులర్ చేసుకోవడానికి ఆ కళాకారుల చిత్రాలపైనే కాగితపు పోస్టర్లు అంటిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ముగ్గులయ్య తన ఫోటో పైన అంటించిన వాల్ పోస్టర్ ను తనే తొలగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి దురదృష్టకైన పరిస్థితి రావడం అనేది దారుణమైన విషయం.

భీమ్లా నాయక్ తో విపరీతమైన గుర్తింపు 

అయితే కొంతమంది సినిమా అనే ప్లాట్ఫామ్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతారు కాబట్టి భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ కోసం పాడిన మొగులయ్య వాయిస్ విపరీతంగా పాపులర్ అయిపోయింది. అలానే అప్పట్లో పలు రకాల ఇంటర్వ్యూస్ ఆయనవే కనిపించాయి.

అయితే మీడియా ఛానల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు పాపులర్ అవుతున్నారు అంటే ఆ వారం రోజులకు సంబంధించి వాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం సహజంగా జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ కళాకారుడు ఏమైపోయాడు అని పట్టించుకోను కూడా పట్టించుకోరు.

Also Read: The RajaSaab Song : ప్రభాస్ రాజాసాబ్ సెకండ్ సింగిల్ వచ్చేసింది, డార్లింగ్ డీసెంట్ లుక్స్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×