E-Paper
Advertisement

Mysterious Doors: ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తెరవని రహస్య తలుపులు, ఎందుకో తెలుసా?

Mysterious Doors: ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తెరవని రహస్య తలుపులు, ఎందుకో తెలుసా?
Advertisement

Mysterious Doors Around world: ప్రపంచవ్యాప్తంగా చరిత్ర, మతం, శాపాల కారణంగా కొన్ని రహస్య ద్వారాలను తెరిచేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ వాటిని ఎవరూ తెరిచే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ తెరవని రహస్య ద్వారాలు ఉన్నాయి. వీటిలో పురాతన సమాధులు, ఆలయాలు, ఇతర నిర్మాణాల్లో దాగి ఉన్నాయి. వీటి వెనుక ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా, ఓపెన్ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రహస్య ద్వారాలు  

 

⦿ పద్మనాభస్వామి ఆలయం వాల్ట్ B (కేరళ, భారత్)

Advertisement

ప్రపంచంలోనే అత్యంత సంపదతో కూడిన ఆలయం ఇది. 2011లో మిగతా వాల్ట్‌ లు తెరిచారు. వాటిలో లక్షల కోట్ల విలువైన బంగారం, ఆభరణాలు దొరికాయి. కానీ, వాల్ట్ B ద్వారం ఇంకా తెరవలేదు. దానిపై రెండు పెద్ద కోబ్రాల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. మత నమ్మకాలు, శాపం ఉన్నాయని నమ్ముతారు. గరుడ మంత్రం ద్వారా మాత్రమే తెరవగలదనే నమ్మకం కారణంగా మూసి ఉంది.

⦿ కిన్ షి హువాంగ్ సమాధి (చైనా)

చైనా మొదటి చక్రవర్తి సమాధి ఇది. టెర్రకోటా ఆర్మీతో రక్షించబడింది. ప్రధాన సమాధి చాంబర్ ఇంకా తెరవలేదు. మెర్క్యురీ విషం, బూబీ ట్రాప్స్, ఆర్టిఫాక్ట్స్ డ్యామేజ్ భయం కారణంగా ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. ఇది 2,000 ఏళ్లుగా మూసి ఉంది.

⦿ తాజ్‌ మహల్ బేస్‌ మెంట్ రూమ్స్ (ఆగ్రా, భారత్)

Advertisement

తాజ్‌ మహల్ లో భూగర్భ గదులు ఉన్నాయి. వాటి ద్వారాలు శతాబ్దాలుగా సీల్ చేయబడ్డాయి. సంరక్షణ కారణాలని అధికారికంగా చెప్పినా.. లోపల విలువైన సంపద ఉండవచ్చే అనుమానాలు ఉన్నాయి.  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ద్వారాలను ఓపెన్ చేయడాన్ని నిషేధించింది.

⦿ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా సీక్రెట్ షాఫ్ట్స్ (ఈజిప్ట్)

క్వీన్స్ చాంబర్‌ లోని రెండు షాఫ్ట్స్ చివర్లో చిన్న ద్వారాలు ఉన్నాయి. 1993లో రోబోట్ ద్వారా కనుగొన్నారు. ఇంకా తెరవలేదు. స్ట్రక్చర్ డ్యామేజ్ భయం, హాల్ ఆఫ్ రికార్డ్స్, నిధులు ఉండవచ్చనే కారణాలతో వాటిని ఓపెన్ చేయడం లేదు.

⦿ గ్రేట్ స్ఫింక్స్ హిడెన్ చాంబర్స్ (ఈజిప్ట్)

స్ఫింక్స్ కింద రహస్య చాంబర్స్ ను ద్వారాలు సీస్మోగ్రాఫ్ ద్వారా కనుగొన్నారు. కానీ, ఇప్పటికీ తెరవలేదు. పురాతన రహస్యాలు దాగి ఉండవచ్చనే కారణంగా ఓపెన్ చేసేందుకు భయపడుతున్నారు.

⦿ జపాన్ హిమురో మాన్షన్ ఐస్ డోర్

హిమురో భవనంలోని తాళం వేసి, మంచుతో కప్పబడిన ద్వారం జపాన్‌ లోని అత్యంత రహస్యమైనది. దానిని ఇప్పటి వరకు తెరవలేదు. అందులో ఏం ఉందనేది ఇప్పటికీ ఓ మిస్టరీగా కొనసాగుతోంది.

ఇవి లెజెండ్స్, హిస్టారికల్ రికార్డ్స్, ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ ఆధారంగా ఎక్కువగా చర్చించబడే రహస్య ద్వారాలు. కొన్ని మతపరమైన, మరికొన్ని సైంటిఫిక్ కారణాల వల్ల తెరవకుండా ఉన్నాయి. భవిష్యత్తులో ఎదో ఒకరోజు తప్పకుండా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: ఇతడు 1998 నుంచి నడుస్తూనే ఉన్నాడు.. 2026 నాటికి ఇంటికి చేరే ఛాన్స్, ఎందుకలా?

Related News

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

Big Stories

Advertisement
×