E-Paper
Advertisement

పెర్ఫెక్షన్ పేరుతో ఇండస్ట్రీని ఖూనీ చేస్తున్న స్టార్ హీరోలు..

పెర్ఫెక్షన్ పేరుతో ఇండస్ట్రీని ఖూనీ చేస్తున్న స్టార్ హీరోలు..
Advertisement

Tollywood Crisis:ప్యాన్ ఇండియా సినిమాలు..వేల కోట్ల వసూళ్లు ..వరల్డ్ వైడ్ గా గుర్తింపు..చూడ్డానికి అంతా బానే ఉంటుంది.కానీ ఈ గ్లామర్ వెనుక టాలీవుడ్ ఫైనాన్షియల్ సిస్టం తలాకుతలం అయిపోతుంది.మన టాప్ హీరోలు కళా ఖండం తీస్తున్నామనే భ్రమలో ఒక్కో సినిమాకు ఐదేళ్లు కేటాయించడం, టాలీవుడ్ మనుగడకే ముప్పులా మారిపోతుంది.ఒకరకంగా చెప్పాలంటే ఇది పెర్ఫెక్షన్ కాదు.. పక్కా ప్లానింగ్ లేని తీరు.

ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా చేస్తే

Advertisement

ఎవరెన్ని చెప్పినా అంతిమంగా సినిమా అంటే ఫక్తు బిజినెస్ .ఇక్కడ మనీ సర్క్యులేషన్ చాలా ముఖ్యం.సో ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా చేస్తే, ఆ వందల కోట్ల పెట్టుబడి మళ్ళీ మార్కెట్ లోకి వచ్చి మరో పది చిన్న సినిమాలకు పెట్టుబడిగా మారుతుందనేది వాస్తవం.కానీ మన హీరోలు మూడేళ్లకో సినిమా కాని వదలని పరిస్థితి.అలెక్కన డబ్బు మళ్ళీ సినిమాలోకి వచ్చి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ఈజీగా నాలుగైదు ఏళ్ళు పడతాయ్. అంటే చాలా చిన్న సినిమాలు ఫండింగ్ లేక ఆగిపోతాయన్న మాట.

కలెక్షన్లు కేవలం వడ్డీలు కట్టడానికే

Advertisement

ఇక నిర్మాతలకి తరబడి వడ్డీల భారం పెరుగుతూనే ఉంటుంది. సూపర్ హిట్ అయినా, ఆ వచ్చిన కలెక్షన్లు కేవలం వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయన్నది జగమెరిగిన సత్యం.ఎటొచ్చిహీరోలు తమ రెమ్యూనరేషన్ జేబులో వేసుకుని సేఫ్ అవుతున్నారు కానీ, వారి వల్ల నిర్మాతలు రోడ్డున పడుతున్నారనేది కాదనలేని సత్యం.స్టార్ హీరోల సినిమా వస్తేనే థియేటర్ల దగ్గర సందడి ఉంటుంది ఎవరూ కాదనలేరు.పైగా ఏడాది పొడుగునా చిన్న సినిమాలతో డీలా పడ్డ ఎగ్జిబిటర్లు, తమ ఆశలన్నీ అగ్ర హీరోలపైనే పెట్టుకుంటారు కూడా .

ఫలితంగా ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు

కానీ మన స్టార్లు షూటింగ్ల పేరుతో ఏళ్ల తరబడి గ్యాప్ ఇస్తుండటంతో థియేటర్లు కళ తప్పుతున్నాయి. ఫలితంగా ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు అయిపోతున్నారు. ఇంట్లోనే కొత్త కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు ఇక థియేటర్ మొహమే చూడటం మానేశాడు.ఈ స్టార్ల ఈ ‘గ్యాప్’ వల్ల థియేటర్లపై ఆధారపడ్డ వేలాది మంది వర్కర్స్ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి.

అంతు చిక్కని బేతాళ ప్రశ్న.

ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చూసిన సినీ ప్రేమికులు , ఇప్పుడు తమ హీరో ముఖాన్ని వెండితెరపై చూడటానికి మూడేళ్లు వేచి చూడాల్సి వస్తోంది. హాలీవుడ్ వంటి పరిశ్రమల్లో భారీ విజువల్స్ ఉన్న సినిమాలను కూడా పక్కా షెడ్యూల్‌తో ఏడాదిన్నరలో పూర్తి చేస్తున్నారు. మరి మన స్టార్లకు ఎందుకింత టైమ్ అన్నది అంతు చిక్కని బేతాళ ప్రశ్న. హీరోలు తమ క్రేజ్ పెరుగుతోందని అనుకుంటున్నారు కానీ, వాస్తవానికి ఆ గ్యాప్ లో కొత్త టాలెంట్ రావడంతో వీరి బ్రాండ్ వాల్యూ పడిపోతుందన్న విషయం మర్చిపోతున్నారు.సినిమాని సెట్స్ మీద పెట్టేసి డిబేట్లు పెట్టడం కన్నా పక్కాగా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే మంచిది కూడా.సినిమా బాగుండాలనే ఆశ ఉండొచ్చు.కానీ అది ఇండస్ట్రీని నాశనం చేసేలా ఉండకూడదు కదా. స్టార్ హీరోలూ ఇకనైనా కాస్త సినిమాలు త్వరగా వదులుతారు కదూ !

also read:సీతమ్మగా సాయి పల్లవి.. 4000 కోట్ల ‘రామాయణ’లో ఆమె రెమ్యూనరేషన్ ఇంత తక్కువా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×