E-Paper
Advertisement

Parasakthi Censor: పరాశక్తి విడుదలకు లైన్ క్లియర్.. సెన్సార్ పూర్తి.. రన్ టైం డీటెయిల్స్..

Parasakthi Censor: పరాశక్తి విడుదలకు లైన్ క్లియర్.. సెన్సార్ పూర్తి.. రన్ టైం డీటెయిల్స్..
Advertisement

Parasakthi Censor:  సంక్రాంతి పండుగ సందర్భంగా కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా నటించిన పరాశక్తి (Parasakthi)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర(Sudha kongara) దర్శకత్వంలో శివ కార్తికేయన్ శ్రీ లీల(Sreeleela) హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 10 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ సమస్యలను ఎదుర్కొంది. ఈ సినిమా హిందీ ఉద్యమ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా హిందీ వ్యతిరేకత సన్నివేశాల గురించి సెన్సార్ అభ్యంతరం తెలపడమే కాకుండా ఈ సినిమాలో ఏకంగా 23 కట్స్ విధించినట్టు తెలుస్తుంది.

U/A 16+ సర్టిఫికెట్ జారీ…

ఈ సినిమాలో కొన్ని సన్ని వేషాలు వివాదాలకు దారి తీసేలా ఉన్న నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు విడుదలకు అనుమతి తెలపలేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిందని , యధావిధిగా పరాశక్తి విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలు కొన్ని సన్నివేశాలను సవరించిన అనంతరం సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసిందని 162 నిమిషాల 43 సెకండ్ల నిడివితో ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. పరాశక్తి సినిమాకు 25 అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తాజాగా సెన్సార్ సభ్యులు వెల్లడించారు. అయితే ఇందులో కొన్ని పదాలను మ్యూట్ చేయటం, మరి కొన్నింటిని మాడిఫైడ్ చేశారని తెలుస్తోంది.

పరాశక్తి విడుదలకు లైన్ క్లియర్..

Advertisement

ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో మరి కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తమిళ డబ్బింగ్ సినిమాలు మరి కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది.

విలన్ గా రవి మోహన్…

Advertisement

ఈ సినిమా 1965వ సంవత్సరంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవి మోహన్, దేవ్ రామనాథ్, అత్వర, బాసిల్ జోసెఫ్, రానా దగ్గుబాటి వంటి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కర్ నిర్మిస్తున్నారు. మరి ఎన్నో అవంతరాలను దాటుకుంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Parasakthi Censor Cuts: పరాశక్తికి సెన్సార్ కష్టాలు..ఏకంగా 23 కోతలు.. విడుదల కష్టమేనా?

Related News

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

Big Stories

Advertisement
×