Jagan Politics: ఏపీ రాజధాని అమరావతిని ఎలాగైనా ఆపాలని తన ప్రయత్నాలు జగన్ షురూ చేస్తున్నారా? న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యారా? న్యాయ నిపుణులతో మంతనాలు సాగిస్తున్నారా? రాజధాని పూర్తి అయితే తమ పార్టీకి లైఫ్ ఉండదని భావించి ఈ అంశాన్ని ఎత్తుకున్నారా? బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్దత వస్తుందా? మళ్లీ కేంద్రం పెద్దలు ఆలోచనలో పడతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రాజధాని అమరావతి వ్యవహారం
ఏపీ రాజధానిపై మాజీ సీఎం జగన్ మరోసారి విషం చిమ్మే ప్రయత్నం చేశారు. గురువారం మీడియా ముందుకొచ్చిన ఆయన, సెలెక్టివ్‌గా కొన్ని నేషనల్ ఛానెళ్లతో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నగరాన్ని రివర్ బేసిన్‌లో సోకాల్డ్ రాజధాని కడుతున్నట్లు వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీంకోర్టు ఆలోచన చేయాలన్నారు. రాజధాని అనే పదం లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొంటే అదే రాజధాని అవుతుందని మనసులోని మాట బయపెట్టారు. రహదారులు, నీరు, విద్యుత్ సరఫరాకు ఎకరానికి రెండు కోట్లు అవుతాయని తనదైన శైలిలో లెక్కలు వేశారు.
ప్రస్తుతం రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది? రాజధాని నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండేళ్లలో భవనాలు కట్టాలని కూటమి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. డే అండ్ నైట్ అక్కడ పనులు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి నగరానికి చట్టబద్దత రానుంది. దీనిపై ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరోవైపు అమరావతిలో రెండో విడత భూసేకరణ మొదలైంది. ఇవన్నీ వేగంగా జరిగితే వైసీపీ ఫ్యూచర్ ఉండదని భావించి కొత్త మెలిక పెట్టారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కోర్టుకి వెళ్లేందుకు జగన్ మంతనాలు?
నిజానికి రాజధాని అమరావతి విషయంలో వైసీపీకి కచ్చితమైన స్టాండ్ అంటూ ఏమీ లేదు. 2014-19 మధ్యకాలంలో అమరావతికి జై కొట్టారు జగన్. అధికారంలోకి వచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారు. అసలు రాజధాని అనే పదం లేదన్న ఆయన, మూడు రాజధానుల ఎలా పెట్టారన్నది టీడీపీ నేతల ప్రశ్న. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. రాజధానిగా అమరావతిని గుర్తించపోవడం వల్ల తాము ఓటమి పాలయ్యామని ఆ తర్వాత ఆ పార్టీ నేతలు బయటపెట్టారు. వైసీపీ స్టాండ్ మారుతుందేమోనని అందరూ భావించారు. ఈలోగా జగన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
వైసీపీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. న్యాయ నిపుణులతో జగన్ మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా అమరావతి నిర్మాణాలు ఆపాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ వారం లేకుంటే వచ్చేవారంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికర ప్రశ్న. ప్రపంచం లో చాలా నగరాలు నదీ తీరాల వెంబడి కొలువు దీరాయి కూడా. అమరావతిలో నిర్మాణాలకు ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో జగన్ ఇలాంటి స్టాండ్ తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు మింగుడుపడడం లేదు. దీనిపై నోరు ఎత్తేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు రావడంలేదు. ఈ వ్యవహారం వైసీపీలో చిచ్చు రేగడం ఖాయమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ALSO READ: అమరావతి మార్పుపై హింట్ ఇచ్చిన జగన్
అమరావతే ఎందుకు రాజధాని అనే ప్రశ్నకు ఇంతకు మించిన సమాధానం అవసరంలేదు #Amaravati pic.twitter.com/sduizksuDO
— AP with CBN (@I_am_with_cbn) January 9, 2026